ఏపీ ప్రభుత్వం ఎవరినీ వదలట్లేదు. అందరి దూల తీర్చేస్తోంది. ఇప్పుడు విద్యుత్ ఉద్యోగుల వంతు వచ్చింది. వారికి న్యాయం ఇవ్వాల్సిన పీఆర్సీలు ఇవ్వకుండా.. జేఏసీ నేతలతో ఒప్పందాలు చేసేసుకుని.,. ఉద్యోగుల్లాగే ముంచే ప్రయత్నం చేస్తూ.. మరో వైపు వారి పీఎఫ్ సొమ్ములను లాగేసుకునేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. రెండు, మూడు రోజుల్లో ఆ పని పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.
ఆర్బీఐ దగ్గర అప్పులు తెచ్చుకునేందుకు కేంద్రం ఇచ్చిన లిమిట్ పూర్తయింది. ఇంకా అదనపు అప్పులకు కేంద్రం అనుమతి ఇస్తుందో లేదో తెలియదు. ఇచ్చినా సరిపోవు. అందుకే లిక్కర్ బాండ్లను మరోసారి వేలం వేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏపీ లిక్కర్ బాండ్లను వేలం వేస్తే ఎవరూ కొనరు. అందుకే… విద్యుత్ ఉద్యోగుల పీఎఫ్ సొమ్ముతో కొనిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. సాధారణంగా ప్రభుత్వాలు బాండ్లు వేలం వేయలంటా క్రిసిల్ లాంటి సంస్థల రేటింగ్ కీలకం. కానీ జగన్ రెడ్డి తన స్కాముల కోసం ఏకంగా డెలాయిట్ లాంటి కంపెనీల నుంచే తప్పుడు రిపోర్టులు పుట్టించారు. ఇప్పుడు కొత్త రేటింగ్ సంస్థను రేసులోకి తెచ్చారు. ఎవరికీ తెలియని ఆక్యూటీ నే సంస్థ లిక్కర్ బ్లాండ్లకు ఏ ప్లస్ రేటింగ్ ఇచ్చిందని వేలానికి పెడుతున్నారు.
దీని వెనుకా పెద్ద స్కామ్ ఉందని..అత్యధికం ఈ బాండ్లను విద్యుత్ సంస్థల ఉద్యోగుల పీఎఫ్ సొమ్ముతో కొనుగోలు చేయించబోతున్నారు. బయట వాళ్లు కూడా కొన్నారని చెప్పడానికి కొంత మంది అస్మదీయ పెట్టుబడిదారులతో పరిమితంగా కొనిపించే కుట్ర చేస్తున్నారని అంటున్నారు. నిజానికి బేవరేజెస్ కార్పొరేషనే చట్టవిరుదధంగా ఏర్పాటు చేశారని అందరికీ తెలిసినా.. కేంద్రం ఆశీస్సులు ఉండటంతో నడిచిపోతోంది. రుణాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు విద్యుత్ సంస్థల పీఎఫ్ సొమ్ముకే టెండర్ పెట్టారు.
మరో ఆరు నెలల్లో… ఏపీలో ఉద్యోగులు అందరి చేతుల్లో పనికి రాని కాగితాలే ఉంటాయి.. ఒక్క దానికి విలువ ఉండదు. ఎవరికీ మినహాయింపు ఉండదు. అందరి దూలా తీరిపోతుంది.