జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ వారాహి విజయ యాత్ర సభలో ప్రజలను రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యాలు చేశారనే అభియోగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. పవన్ సభకు 30 సెక్షన్ కింద అనుమతి తీసుకున్న జనసేన పార్టీ కార్యదర్శి కోన తాతారావుకి పోలీసులు నోటీస్ లు అందజేశారు. సెక్షన్ 30కి విరుద్దంగా పవన్ ప్రసంగం ఉందంటూ ఆ నోటీస్ లో పేర్కొన్నారు. సభలో ప్రసంగించే సమయంలో సంయమంతో ఉండాలని, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండరాదని పోలీసుల అన్నారు..
ఇకపై అటువంటి ప్రసంగం చేసినట్లయితే అనుమతి తీసుకున్న మీపైనా, ప్రసంగించిన వారిపైన కూడా చట్టం తనపని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు.. కోన తాతరావుకు ఇచ్చిన నోటీస్ కాపీని పవన్ కల్యాణ్ కు కూడా పోలీసుల అందజేశారు.. అందులో పోలీస్ నిబంధనలు పాటిస్తూ, సభను నిర్వహించుకోవాలని సూచించారు.. నిరాధార, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని కోరారు.. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించబోనంటూ తమకు అఫిడవిట్ ఇవ్వాలని పోలీసులు పవన్ ను ఆదేశించారు.
అసలు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం పూర్తిగా రాజకీయ పరమైనది. ముఖ్యమంత్రిని విమర్శించం రాజకీయ నేతల ప్రాథమిక హక్కు.ప్రశ్నించడం వారి బాధ్యత . పోలీసుల తీరు చూస్తే.. పవన్ కల్యాణ్ నోరు మూయించడానికి నోటీసులతో ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. అయితే ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని.. తాము జగన్ రెడ్డిని విమర్శించే విషయంలో తగ్గేదిలేదని జనసేన వర్గాలంటున్నాయి. పోలీసుల ఒత్తిడికి తలొగ్గితే.. రేపు వారే స్క్రిప్ట్ ఇచ్చి అదే చదవమని అంటారని.. మండిపడుతున్నారు.