మార్గదర్శిలో ఏ లోపాలు కనిపించకపోయినా ఏదో ఒకటి చేసేద్దామని పిచ్చి పట్టినట్లుగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కోర్టుల నుంచి భారీగానే మొట్టికాయలు పడుతున్నాయి. కాన ప్రజల డబ్బులను ఖర్చుపెట్టి అయినా సరే మర్గదర్శిని దెబ్బకొట్టాలని చేసిన ప్రయత్నం కూడా విఫలమయింది. కోట్లాది రుపాయలు ఖర్చుపెట్టి.. తన మొహంతో కాకుండా.. తొలి సారి మార్గదర్శిపై ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. చిట్స్ ను మూసేస్తామని ఆ నోటీసుల సారాంశం. దీనిపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ నోటీసుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.
చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిట్స్ రిజిస్ట్రార్ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు పేర్కొంది. చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావించింది. చందాదారుల వ్యాజ్యాలు, మార్గదర్శి వ్యాజ్యాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది.కొద్దిరోజుల క్రితం మార్గదర్శి చిట్స్కి చెందిన కొన్ని గ్రూపులను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేని మార్గదర్శిపై ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చిట్లను నిలిపివేయటంపై మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది.
ఓ ప్రైవేటువ్యాపార సంస్థపై దాడి చేయడానికి ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని ఇలా సొంత మీడియాకు విచ్చలవిడిగా ఫుల్ పేజీ ప్రకటనల రూపంలో ఇవ్వడం సంచలనం అయింది. ఇంత దారుణంగా అధికార దుర్వినియోగం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇంత చేసినా మార్గదర్శిని ఏమీ చేయలేకపోతున్నారు. ఖాతాదారుల్లో నమ్మకాన్ని కూడా తగ్గించలేకపోతున్నారు. చివరికి అక్రమంగా తన పత్రికకు ఇచ్చిన ఫుల్ పేజీ డబ్బులు మాత్రమే మిగిలాయి..కానీ పరువు పోయింది.