సీఎం జగన్ డిజిటల్ సంతకాల్ని దుర్వినియోగం చేశారని సీఎంవోలో పని చేస్తున్న ఐదుగురు అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల స్థాయి ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లుగా సైబర్ క్రైమ్ సీఐడీ ప్రకటించింది. దీనిపై దర్యాప్తు చేస్తన్నట్లుగా చెప్పుకొచ్చింది. నిజానికి స్కాం బయటపడి పది రోజులుకపైగా అవుతోంది. అంతా బయటకు తెలిసిన తర్వాత ఇక చర్యలు తీసుకోకపోతే తప్పదని అనుకున్నారేమో కానీ ఐదుగుర్ని అరెస్ట్ చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో.. సీఎంవో ఈ ఫైలింగ్ పాస్ వర్డులు ఎవరికీ తెలియవు .అత్యంత కాన్ఫిడెన్షియల్ . సంబంధిత అధికారుల వద్దనే ఉంటాయి. అయితే ఎలా తెలుసుకున్నారో కానీ అటెండర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తెలుసుకున్నారని.. వారు ఈ ఆఫీసులో లాగిన్ అయి.. సీఎం డిజిటల్ సిగ్నేచర్ ను వాడికి ఫైళ్లను క్లియర్ చేశారని అంటున్నారు. ఇలా క్లియర్ చేసినందుకు.. ఒక్కో ఫైల్‌కు ఒక్కో ఫైల్‌కు ₹30 వేల నుంచి ₹50 వేల వరకూ వసూలు చేశారని సీఐడీ అధికారులు చెబుతున్నారు.
అయితే సీఎంవోలో ఉన్న ఫైళ్ల గురించి.. ఇతరులకు తెలియదు. అటెంజర్లకూ తెలియదు. ఎలా వసూలు చేస్తారన్న ఆలోచన సీఐడీ అధికారులు చేయలేదు. ఇదంతా ఓ ఐఏఎస్ అధికారి మామ నేతృత్వంలో సాగిన స్కాం అని.. సెక్రటేరియట్ లో గుసగుసలు వినపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో గూడుపుఠాణి చాలా ఉందని అందుకే ఎవరికీ తెలియకుంా.. కింది స్తాయిలో అటెండర్లను.. జేటా ఎంట్రీ ఆపరేటర్లను బలి చేసి … అసలు నిందితుల్ని తప్పిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి స్కాంలు జరగడాన్ని గొప్పగా భావించే పాలకులు.. బయటకు తెలియకపోతే చాలనుకుంటున్నారు. దానికి తగ్గట్లుగానే వ్యవహరిస్తున్నారు.