ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కనిపిస్తోంది. ఏపీ సీఎంవోలో ఏకంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డిజిటల్ సంతకాలను ఆరేడు నెలలుగా దుర్వినియోగం చేస్తున్న విషయం పై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ సైబర్ క్రైమ్ అధికారి చెప్పిన వివరాలు వింటే ఎవరికైనా .. ప్రభుత్వం ఉందా.. ఎత్తిపోయిందా అనే డౌట్ రాకుండా మారదు.
హవ్వ సీఎం కార్యదర్శుల యూజర్ నేమ్, పాస్ వర్డులు అటెండర్లుకు తెలుస్తాయా /
సీఎంవో అంటే.. సెక్రటేరియట్ కన్నా పవర్ ఫుల్. సీఎం సంతకం అంటే చిన్న విషయం కాదు. ఈ ఆఫీస్లో సీఎం డిజిటల్ సిగ్నేచర్లకు ఎంత సెక్యూరిటీ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సీఎం ప్రధాన కార్యదర్శులుగా ఉండే ఐఏఎస్ అధికారులకే ఇది సాధ్యం. కానీ అక్కడ అటెండంర్లు సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి యూజర్ నేమ్, పాస్ వర్డులుతెలుసుకోవడమే కాదు.. సీఎం డిజిటల్ సిగ్నేచర్లను ఉపయోగించి సీఎంపీలను కూడా జారీ చేసేశారు. ఇదంతా అటెండర్లకు.. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఎలా సాధ్యం ? . అసలు ఈ ఆఫీస్ వాడాలంటనే ట్రైనింగ్ ఉండాలి. అది అందిరకీ తెలియదు. ఎవరు చేస్తారు ?
ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుందా ?
ప్రతీ దానికి ఓ రేటు కట్టుకోవడం.. వైసీపీ పెద్దలకు ఓ ప్యాషన్. అందుకే.. సీఎం జగన్ రెడ్డి సంతకాలకోస వచ్చిన ఫైళ్లన్నింటికీ ఓ రేటు కట్టుకుని ఉంటారని అంటున్నారు. అయితే విషయం బయటకు వచ్చే సరికి అందరూ తప్పుకుని అటెండర్లను బలి చేశారని అంటున్నారు. నిజానికి ఇలా ఎన్ని ఫైళ్లు క్లియర్ అయ్యాయో ఎవరికీ తెలియదు. సీఐడీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కానీ సీఐడీ.. బయటపడింది కాబట్టి.. ఏదో చేయాలన్నట్లుగా తూ తూ మంత్రం దర్యాప్తు చేశారు. నిజాలు వెలికి తీస్తే అసలు ఇలా తప్పుడు మార్గాల్లో ఫైళ్ల క్లియరెన్స్ వెనుక ఉన్న ముఖ్యుల గుట్టు బయటపడుతుంది. కానీ చేయరు. ఎందుకంటే.. దొంగలు..దొంగలుకలిసి ఊళ్లు పంచుకున్నట్లుగా పరిపాలన ఉంది మరి.
దొంగతనం చేసిన వాళ్లే గొప్పన్నట్లుగా సాగుతున్నపాలన !
ఏపీలో ఇప్పుడు దొంగలదే రాజ్యం. దోపిడీ దారులతే ప్రభుత్వం. ఎంత పెద్ద అవినీతి చేసి ఉంటే.. ప్రభుత్వంలో అంత ప్రాధాన్యత లభిస్తుంది. ఎన్ని కేసులు ఉంటే సీఐడీలో అంత ప్రాధాన్యత లభిస్తుంది. ఇలా చెప్పకుంటూ పోతే.. ప్రభుత్వం అంతా కేసులు, అవినీతి మరకలున్న అధికారుల చేతుల మీదుగానే నడుస్తోంది. అంతా పై వాడి దయ అనుకోవడమే. వీరంతా పాలనలో నిజాయితీగా ఉంటారని ఎలా అనుకుంటారు… దొరికితే అటెండర్లు దొంగలు.. లేకపోతే దొరల్లా దోచుకుని తినడమే. ఇదే ఏపీలో పాలన