కమ్యూనిస్టుపార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసతున్నాయి. దక్షిణ తెలంగాణలో కమ్యూనిస్టులకుప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు వేల ఓట్లు ఉంటాయని బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పది వేల ఓట్లు ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో ఇవే కీలకం అయ్యే అవకాశాలు ఉన్నాయి. టఫ్ ఫైట్ ఉంటుందని రిపోర్టులు వస్తూండటంతో… కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు ఇచ్చి అయినా పొత్తులు పెట్టుకోవాలనుకుంటున్నారని అంటున్నారు.
సీపీఐ, సీపీఎం పార్టీలకు నమ్మకమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అధినేత అంచనా వేస్తున్నారు. ఈ సారి కూడా కనీసం మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లోనూ ఒక్క సీటు కంటే ఎక్కువ దక్కించకోలేకపోయారు. క్కడ తక్కువలో తక్కువగా ప్రతి నియోజకవర్గంలో 5 వేల వరకు ఓట్లు ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నాయి. ఈ ఓట్లు గెలుపోటముల్ని తేలుస్తాయని నమ్ముతున్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో సాలిడ్ ఓటు బ్యాంక్ ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత కమ్యూనిస్టులతో కమ్యూనికేషన్ ను కేసీఆర్ నిలిపివేశారు. ఈ అంశంపై కమ్యూనిస్టుపార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. అయితే మళ్లీ కేసీఆర్ మనసు మార్చుకున్నారని.. కమ్యూనిస్టులతో పొత్తులకు సిద్ధమవుతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ఒక వేళ తాము అంగీకరించకపోతే.. వారు కాంగ్రెస్ తో వెళ్తారని.. అది బీఆర్ఎస్ కు మరింత నష్టం చేకూరుతుందని అనుకుంటున్నారు.
సీపీఐ, సీపీఎం చెరో మూడు స్థానాలు అడుగుతున్నాయి. కానీ కేసీఆర్ చెరో రెండు స్థానాలు ఆయా పార్టీల అగ్రనేతలకు ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.