అవసరం లేకపోయినా చేర్చుకున్న నేతల వల్ల ఎన్నికలకు ముందు వైసీపీకి సైడ్ ఎఫెక్ట్స్ గట్టిగా తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. అవసరం లేకపోయినా నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకుని సాధించుకున్నది ఏమీ లేకపోగా.. ఉప్పుడు ఆయా స్థానాల్లో ఉన్న నేతలు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. గన్నవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీలో చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. చీరాల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు.
రాజీ చేయడానికి ఆమమంచిని బలవంతంగా ఆయనను పర్చూరు పంపారు జగన్. కానీ ఆయన మనసు చీరాలలోనే ఉంది. అందుకే వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికుల జరుగుతూంటే తమ వారిని నిలబెడుతున్నారు. అక్కడ కూడా పరిస్థితి చేయిదాటిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఆయన జనసేనలో చేరి పోటీ చేస్తారని చెప్పుకుంటున్నారు. విశాఖ దక్షిమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయనకు టిక్కెట్ ఖారారుచేస్తే ఇతరులు పని చేసే అవకాశం లేదు. ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ముందు ముందు ఎమ్మెల్యేలు కాకుండా పార్టీలో నేతల్ని చేర్చుకున్న చోట్ల పరిస్థితి ఎలా ఉంటుందోనని వైసీపీ పెద్దలు కంగారు పడుతున్నారు.
శిద్దా రాఘవరావు టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్నారు. ఆయన వ్యాపారాలపై దాడులు చేసి వందలకోట్ల ఫైన్లు వేసి… చివరికి పదవులుఆశ పెట్టి పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన రగిలిపోతున్నారు. ఇలాంటివి దిగువస్థాయిలోనూ ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు కాకుండా .. టీడీపీ నుంచి చేరిన వారే బాగుపడ్డారని.. తమకు మేలు జరగలేదని అసలైన క్యాడర్ కూడా ఫైర్ మీద ఉంది. ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. ఈ సైడ్ఎఫెక్టులు ఎక్కువగా ఉంటే… ఫలితాల్లో తేడా వచ్చే ప్రమాదం ఉందనుకుంటున్నారు.