నిఖిల్ – చందూ మొండేటి కాంబోలో రూపొందిన కార్తికేక డీసెంట్ హిట్‌గా నిలిచింది. సీక్వెల్‌గా రూపొందిన కార్తికేయ 2 పాన్ ఇండియా స్థాయిలో ఊహించని విజయాన్ని అందించింది. నిఖిల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇది. ఈ సినిమా వచ్చి యేడాది పూర్తయ్యింది. ఇప్పుడు కార్తికేయ 3 ఎప్పుడు అనే ఆసక్తి నెలకొంది. ఇటు నితిన్, అటు చందూ మొండేటి తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దాంతో కార్తికేయ 3 ఆలస్యం అవుతుందని భావించారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించి ఓ హింట్ ఇచ్చేశాడు నిఖిల్. కార్తికేయ 3 కథ.. రెడీ అయ్యిందని, త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని చెప్పేశాడు. కార్తికేయ విడుదలై, ఏడాది పూర్తయిన సందర్భంగా నిఖిల్ ఓ పార్టీ ఇచ్చాడు. ఈ సందర్భంగా కార్తికేయ 3 ప్రాజెక్టుని ప్రకటించాడు.
కార్తికేయ కన్నా, కార్తికేయ 2 భారీ ఎత్తున తీశారు. పార్ట్ 3 ఇంకొంచెం ఖరీదైన వ్యవహారమే. కృష్ణతత్వం పార్ట్ 2 విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి ఎలిమెంట్ ఉంటే తప్ప.. కార్తికేయ 3 అంచనాల్ని నిలబెట్టుకోవడం కష్టం. చందూ సరిగ్గా ఇదే పాయింట్ ఆలోయించి కథ రాశాడట. ఈసారి.. ఇంకో బలమైన ఎలిమెంట్ కార్తికేయ 3ని కాపాడుతుందని చందూ, నిఖిల్ భావిస్తున్నారు. 2024 చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్తుంది.