బేబీ సినిమాతో సాయి రాజేష్ పేరు మార్మోగిపోయింది. రూ.5 కోట్లతో తీసిన ఈ సినిమాకు రూ.50 కోట్ల లాభాలు చూపించాడు. దాంతో అందరూ.. సాయి రాజేష్ గురించే మాట్లాడుకొంటున్నారు. సాయి రాజేష్ ఇప్పుడు కాస్త రేంజ్ పెంచి, ఇంకొంచెం పెద్ద స్టార్లతో సినిమాలు చేయొచ్చు. కానీ.. తదుపరి సినిమాకీ `బేబీ ` ఫార్మెట్లోనే వెళ్తున్నాడు.
సాయి రాజేష్ నిర్మాతగా ఓసినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో యూ ట్యూబ్ స్టార్ దేత్తడి హారిక ని కథానాయికగా ఎంచుకొన్నారు. కథ ఆల్రెడీ సెట్టయ్యింది. బేబీ ఓ అమ్మాయి చుట్టూ తిరిగిన కథ. ఆ సినిమాతో కథానాయికగా పరిచయమైన వైష్ణవి కూడా సోషల్ మీడియాలో స్టారే. తనని హీరోయిన్ చేసి హిట్టు కొట్టాడు. ఇప్పుడు హారిక తో అదే ప్రయోగం రిపీట్ చేయబోతున్నాడు. ఇది కూడా యూత్ ని టార్గెట్ చేస్తున్న సినిమానే. కాకపోతే ఈ సినిమాకి సాయి రాజేష్ డైరెక్టర్ కాడు. ఓ కొత్త కుర్రాడికి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారు. సాయి రాజేష్ నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడు. ఈ నెలలోనే ఈసినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రాబోతోంది.