ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇందులో రష్మికని కథానాయికగా ఎంచుకొంటారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమైంది. ఈ సినిమాలో రష్మికని ఖాయం చేసేసింది చిత్రబృందం. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. శేఖర్ కమ్ములయ సినిమాల్లో కథానాయిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమాలోనూ అంతే. ఆ పాత్రకు స్టార్ డమ్ ఉన్న కథానాయిక అవసరం ఉంది. అందుకే రష్మికని ఎంచుకొన్నారు. పైగా ధనుష్, రష్మిక కాంబో కూడా కొత్తగా అనిపిస్తుంది. కాంబో పరంగా…ఇప్పటికే ఈ సినిమా మంచి క్రేజ్ సంపాదించుకొంది. ధనుష్ నటిస్తున్న 51వ చిత్రమిది. తెలుగులో నేరుగా రెండో సినిమా. ఇది వరకు చేసిన `సార్` మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం తన 50 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. అది పూర్తయిన వెంటనే శేఖర్ కమ్ముల సినిమా పట్టాలెక్కుతుంది.