పవన్ కల్యాణ్ వ్యాఖ్యల చురుకుదనం వైసీపీ నేతలకు గట్టిగానే తగులుతున్నట్లుగా ఉంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి.. పవన్ మాట్లాడిన విధానపమైన విషయాలపై కాకుండా ఇతర అంశాలపై మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ వి కారు కూతలు… ఎందుకు అంతలా ఊగటం అని ప్రశ్నించారు. సినిమా హీరో వేసే డైలాగులకు అభిమానుల నుంచి ఈలలు ఎక్కడైనా కనిపిస్తాయన్నారు. మేం గట్టిగా మాట్లాడితే దాని పై ఇంకో రకంగా రియాక్ట్ అవుతారని అన్నారు.
ప్రతిపక్షాలు అరాచక శక్తుల మూక అని, చంద్రబాబు డైరెక్షన్ లో ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెల్లని నాణాలు లాంటి పార్టీలు.. ఫుల్ సైజ్ ఆర్కెస్ట్రా అంటూ తన కోపాన్ని తీర్చుకునే ప్రయత్నం చేశారు. అధికారంలో రావాలనే ఉద్దేశం కూడా దత్త పుత్రుడికి ఉన్నట్లు లేదని, వ్యక్తిత్వ హననం చేయటం, అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ వి కారు కూతలు.. ఎందుకు అంతలా ఊగటం.. సందర్భం లేకుండా ఆవేశంగా ఒక డైలాగ్ వేయటం.. సినిమా హీరో వేసే డైలాగులకు అభిమానుల నుంచి ఈలలు ఎక్కడైనా కనిపిస్తాయి.. మేం గట్టిగా మాట్లాడితే దాని పై ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. పవన్ కల్యాణ్ యజమాని చంద్రబాబు.. ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాడని ఆరోపించారు.
ఒక్క సజ్జల మాత్రమే కాదు.. పవన్ పై మాట్లాడే డ్యూటీ ఇచ్చిన అందరూ పవన్ పై విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్.. స్పీచులకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. జనం వెల్లువలా వస్తున్నారు. జగన్ ను విమర్శించినప్పుడు ప్రజల్లో వస్తున్న స్పందన.. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా తెలుస్తోంది. అదే సమయంలో జగన్ రెడ్డి కనీసం.. స్పీచుల్ని చదివి చెప్పలేని పరిస్థితుల్లోపడిపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్ సజ్జల రెడ్డిలో కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.