టీటీడీ కొత్త చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అలా బాధ్యతలు చేపట్టగానే ఇలా సమస్యలు వచ్చి పడుతున్నాయి. వెంటనే.. భూమన తన మార్క్ నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని హైలెవల్ మీటింగ్ పెట్టేశారు. వెంటనే.. సంచలనం లాంటి నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. నడుచుకుంటూ వెళ్లే వారికి ఓ కర్ర ఇవ్వడం. ఆ కర్ర ఉంటే..దగ్గరకు జంతువులు రావని ఆయన నమ్మకం. అలాగే.. భక్తులను నియంత్రించాలనుకుంటున్నారు కాబట్టి.. మధ్యాహ్నం రెండు వరకే చిన్నపిల్లలను అనుమతించాలని డిసైడయ్యారు.
శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్లలోపు చిన్నారులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. మ రాత్రి పది గంటల వరకూ పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఉంటుంది. అలిపిరి నుంచి ఘాట్ రోడ్డులో వెళ్ళే ద్విచక్ర వాహనదారులకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకే అనుమతి ఇస్తారు. నడక మార్గం, ఘాట్ రోడ్డులో జంతువులకు తినుబండారాలు ఇవ్వకుండా చర్యలు తీసుకుంటామని .. నడక మార్గంలో ఉన్న హోటల్స్ ద్వారా వచ్చే వ్యర్ధాలు వేయకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. నడక దారిలో ఫోకస్ లైట్స్ ను ఏర్పాటు చేయాలని, ఫెన్సింగ్ ఏర్పాటుపై అటవీ శాఖా అధికారుల నుంచి సలహా అడిగామన్నారు. కేంద్ర అటవీ శాఖ అధికారులకు ఫెన్సింగ్ ఏర్పాటుపై చర్చిస్తాం. అలిపిరి, ఏడోవ మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని భూమన చెబుతున్నారు.
భక్తుల ప్రాణరక్షణే ప్రథమ ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని చైర్మన్ భూమన చెప్పారు. 2007లో కాలినడక మార్గంలో వెళ్ళే భక్తులకు టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు 15 వేల మందికి ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు ఇస్తున్నామని చెబుతున్నారు. త్వరలో కాలి నడకన వెళ్లే వారికి టిక్కెట్లు ఇవ్వడం మానేసి.. దివ్య దర్శనం టిక్కెట్ల కోటా పెంచాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.