ఏపీలో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. విపక్ష నేతలపై హ త్యాయత్నాలు చేసి వారిపైనే హత్యాయత్నం కేసులు పెడతారు. ఇవన్నీ పోలీసులే చేస్తారు. పోలీసులతో చేయిస్తారు చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పోలీసులకూ ఇప్పటికే భయం చూపించారు. అయితే ఇప్పుడు పోలీసుల్లోనూ మార్పు వస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంత మంది కులాభిమానం ఉన్న పోలీసులు తప్ప ఇతరులు మారిపోతున్నారని ఇది వైసీపీ పెద్దల్లో అసహనానికి కారణం అవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
విశాఖలో పవన్ పర్యటన సాఫీగా సాగకూడదనేది వైసీపీ టార్గెట్. అందుకే పవన్ విశాఖ రాక ముందే పోలీసులతో అనేక ఆంక్షలు పెట్టించారు. కానీ పోలీసులు పవన్ పర్యటన సాఫీగా సాగిపోయేలా చేశారు. జనసైనికులు ఎంత భారీగా వచ్చినా ఇబ్బందులు లేకుండా చేశారు. పోలీసులు తమ విధిని తాము పక్కాగా నిర్వర్తిస్తున్నారు. రుషికొండ పర్యటనకు వెళ్లినా… వైసీపీ నేతలు భూముల ఆక్రమణ ఘనకార్యాలను పరిశీలించడానికి వెళ్లినా ఆటంకాలు ఎదురు కానివ్వలేదు. దీంతో వైసీపీ పెద్దలు విశాఖ పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లగుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో విశాఖలో చంద్రబాబు అడుగు పెట్టకుండా చేసిన పోలీసు అధికారులు ఉన్నారు. వైసీపీ నేతల్ని పిలిపించి రాళ్లేయించిన వాళ్లు ఉన్నారు. పవన్ గతంలో విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జనవాణిని కూడా నిర్వహించకుండా కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టించి వెనక్కి పంపేశారు. కానీ ఇప్పుడు మాత్రం.. పోలీసులు అలాంటి పనులు చేయడం లేదు. కుల గజ్జితో బాధపడుతున్న కొంత మంది అధికారులు తప్ప.. ఇతరులు తమను ప్రభుత్వం బలి పశువులు చేయాలన్న ఉద్దేశంతో వాడుకుంటుందన్న అభిప్రాయానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే.. నేరమయ పాలనకు పోలీసుల సహకారం తగ్గుతుంది. అదే జరిగితే వ్యవస్థకు కొంత మేర మేలు జరుగుతుంది.