సమంత చేతిలో ఉన్న ఏకైక సినిమా… ఖుషి. ఇప్పుడు విడుదలకు సిద్దమైంది. సమంత అనారోగ్యం కారణంతో.. సినిమాలకు బ్రేక్ ఇచ్చి, చికిత్స తీసుకొంటున్న సంగతి తెలిసిందే. సమంత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఖుషి ప్రమోషన్లకు రాదేమో అనే అనుమానాలు తలెత్తాయి. ఖుషి టీమ్ కూడా ఇలానే భావించింది. అయితే.. సమంత ఇప్పుడు ఖుషి టీమ్ కి టచ్‌లోకి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల బాధ్యత తానే స్వయంగా తీసుకొంది. సెప్టెంబరు 1 న ఖుషి విడుదల అవుతోంది. ఈలోగా 15 రోజుల పాటు ముమ్మరంగా ప్రమోషన్లు చేయాలని సమంత భావిస్తోంది,
ఈరోజు హైదరాబాద్ లో ఖుషికి సంబంధించిన ఓ ఈవెంట్ జరుగుతోంది. ఇందులో సమంత పాల్లొననుంది. ఖుషి పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఖుషి ఆడియోని ఈ ఈవెంట్ లో సెలబ్రెట్ చేసుకొంటున్నారు. ఈ షోలో సమంత, విజయ్‌దేవరకొండ ఇద్దరూ స్టెప్పులు కూడా వేయబోతున్నార్ట. వీరిద్దరి లైవ్ పెర్‌ఫార్మ్సెన్స్ ఈ షోకి హైలెట్ కాబోతోందని తెలుస్తోంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని అన్ని పాటలూ ఆయనే రాశారు.