విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి `ఫ్యామిలీ స్టార్` అనే పేరు దాదాపుగా ఖరారు చేసేశారు. ఓ కథానాయికగా మృణాల్ ఠాకూర్‌ని ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మరో కథానాయికకీ ఛాన్స్ ఉంది. ఆ ప్లేస్ దివ్యాంశ కౌశిక్‌కి దక్కింది. మజిలీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిందవి దివ్యాంశ. రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్ తదితర చిత్రాల్లో నటించింది. ఇటీవలే టక్కర్ లో సిద్దార్థ్ తో జోడీ కట్టింది. ఈ సినిమాన్నీ ఫెయిల్ అయినా, గ్లామర్ పరంగా మంచి మార్కులే కొట్టేసింది. ఇప్పుడు విజయ్ సరసన ఛాన్స్ అందుకొంది. `కిక్` శ్యామ్ కి సైతం ఈ చిత్రంలో కీలక పాత్ర దక్కింది. విజయ్ దేవరకొండ సోదరుడిగా కిక్ శ్యామ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ నెలాఖరున చిత్రబృందం అమెరికా ఫ్లైయిట్ ఎక్కబోతోంది. అక్కడ మరో భారీ షెడ్యూల్ జరగబోతోంది. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.