గత ఎన్నికలకు ముదు ఇచ్చి న రుణమాఫీ హామీని ఈ ఎన్నికలకు ముందు పూర్తి చేయాలని కేసీఆర్ గా పెట్టుకున్నారు. వరుసగా భూములు వేలం వేసి.. మద్యం దుకాణాలకు ముందుగానే వేలం… అప్పులు తెచ్చి వచ్చిన డబ్బులతో రుణమాఫీ చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం లోపు రుణమాఫీ పూర్తి చేస్తామని గతంలో చెప్పారు కానీ.. హఠాత్తుగా సోమవారం రోజు.. రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించారు. రూ.లక్షలోపు రుణాలను సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేశామని ప్రకటించేసింది.
నిజానికి రుణమాఫీ అమలు ప్రకటన చేసినప్పుడు రూ.18,241 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విడుదల చేసింది. వెంటనే మూడో తేదీన రూ.37 వేలనుంచి రూ 41 వేల మధ్య ఉన్న రుణాలున్న 62,758 మంది రైతులకు మాఫీ చేస్తూ రూ.237.85 కోట్లు జమ చేసింది. రెండో విడతలో 5,86,270 మందికి రూ.1374.96 కోట్లు మాఫీ అయ్యాయి. ఇంకా 25.98 లక్షల మంది రైతులకు రూ.18,004 కోట్లు అందాల్సి ఉందని లెక్క చెప్పింది. వీటిని ఈ నెల నుంచి వచ్చే నెల రెండో వారం వరకు అయిదు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.ఇప్పుడు మాత్రం రుణమాఫీ పూర్తి అయిందని ప్రకటించింది.
దీంతో లక్ష రూపాయల రుణాలు తీసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా ఉంది . ఇంకా చాల పథకాలకు నిధులుకేటాయించాల్సి ఉంది. దీంతో రుణామఫీ భారాన్ని తగ్గించుకుందా.. మిగిలిన వారికీ ఇస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అనధికారికంగా బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ పూర్తి అయిపోయిందని చెబుతోంది. ఇంకా పది వేలకోట్లు ఇస్తే తప్ప పూర్తి కాదని రైతులు అంటున్నారు.