ఎన్నికల సీజన్ వచ్చేసింది. రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. లోక్ సభ కన్నా కాస్త ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలు… ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు ఎదుర్కోవాల్సిన బీజేపీ అందరూ సిద్ధమయ్యారు. రకరకాల పథకాలతో హోరెత్తిస్తున్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం దూకుడుగా ఉన్నారు. డిసెంబర్లో ఆయన ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకు అవసరమైన సరంజామా మొత్తం రెడీ చేసుకున్నారు.
లక్షల్లో లబ్ది చేకూరుస్తున్న సీఎం కేసీఆర్
కేసీఆర్ పథకాల వల్ల ప్రజలకు కలిగే లబ్ది వందల్లో ఉండవు. వేలల్లో కూడా ఉండదు. లక్షల్లో ఉంటుంది. అలాగే .. వందల మంది లబ్దిదారుల్ని ఇచ్చి ఫుల్ పేజీ ప్రకటనలతో ప్రచారం చేసుకుని.. ఇచ్చేశామని అనుకోరు. లక్షల్లో లబ్దిదారులు ఉంటారు. దళిత బంధు కింద ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నారు. బీసీ బంధు, మైనార్టీ బంధు కింద రూ. లక్ష చెక్కులు ఇస్తున్నారు. గృహలక్ష్మి కింద రూ. మూడు లక్షలు పంపిణీ చేస్తున్నారు. ఇక రైతులకు రుణమాపీ పూర్తి చేశారు. ప్రతీ రోజూ వేల కోట్లు ప్రజలఖాతాల్లో జమ చేస్తున్నారు. వానికో కొత్త పథకం ప్రారంభిస్తున్నారు. దీంతో ప్రజల్లో పదేళ్ల పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని కంట్రోల్ చేసుకున్నట్లవుతోంది.
ఉత్తుత్తి బటన్లు అవుతున్న జగన్ రెడ్డి పథకాలు !
మరో వైపు పొరుగు రాష్ట్రం ఏపీ సర్కార్ ప్రకటించిన పథకాలు.. క్యాలెండర్ ప్రకారం కూడా బటన్లు నొక్కలేకపోతున్నారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పేరుతో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. బటన్లు నొక్కినా డబ్బుులు పడటం లేదు. చాలా పథకాలకూ అదే సమస్య. నిజానికి వీటికి లబ్దిదారులకు కలిగే ప్రయోజనం చాలా పరిమితం. ఇటీవల సున్నా వడ్డీ పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు ఇస్తానంటూ పన్నెండు వందల కోట్లకు జగన్ రెడ్డి బటన్ నొక్కారు. యావరేజీగా… ఒక్కో మహిళకు వచ్చేది పన్నెండు వందల రూపాయలు. ఇవి ఇంకా చాలా చోట్ల పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త పథకాలు ప్రకటించే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ప్రభుత్వం దగ్గర విషయం అయిపోయిదని ప్రజలు కూడా ఓ అంచనాకు వస్తున్నారు.
ఇక కొత్త పథకాలు ప్రకటించినా ఎవరైనా నమ్ముతారా ?
జగన్ రెడ్డి ప్రజాధనాన్ని సొంతానికి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసుకుంటున్నారు . పథకాలకోసం అప్పులు తేవడం… ఆస్తులు అమ్మడం లాంటివి చేస్తున్నారు ఇన్ని చేసినా… ఉన్నపథకాలకే డబ్బులు సర్దలేకపోతున్నారు. అందుకే కొత్త పథకాలు ప్రకటించినా జగన్ ను నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడే ప్రకటించినా అమలు చేయడానికి నిధులు అవసరం. అందుకే తంటాలు పడుతున్నారు.