తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖలో విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారు. దేశం స్వాతంత్ర్యం సాధించి వందో ఏట అడుగు పెట్టేసరికి .. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండాలన్న సంకల్పానికి.. తన వంతుగా ఏపీకి సంబంధించిన విజన్ డాక్యుమెంట్ అది. అందులో ఉన్న విషయాలను సావధానంగా పరిశీలిస్తే…. విభిన్న రంగాల మేధావులు తమ ఆలోచలను గుదిగుచ్చి ఇచ్చిన డాక్యుమెంట్‌గా అర్థం చేసుకోవచ్చు.. మొత్తం 52 పేజీలతో ఈ డాక్యుమెంటును రూపొందించారు.
అభివృద్ధి చెందిన దేశం కోసం ఐదు ప్రధాన మార్గాలు
విజన్ డాక్యుమెంట్లో చంద్రబాబు దేశ అభివృద్ధి కోసం ఐదు ప్రధాన మార్గాలను సూచించారు. అవినీతిని, నేరాలను నియంత్రిస్తే సంక్షేమం, అభివృద్ధి వాటంతట అవే పోటీ పడతాయి. మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం ఇవ్వడం. అన్ని కులాల అభివృద్ధికి అవకాశాలు కల్పించడం, యువతను దేశ సంపదగా తీర్చిదిద్దుకోవడం, పరిశోధనకు పెద్దపీట వంటి అంశాలను ఇందులో పొందు పరిచారు. విభిన్న రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన వారితో కలిసి ‘గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ డెవల్‌పమెంట్’ అనే పరిశోధక సంస్థను చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారానే ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగింది.
ప్రణాళిక లేకపోతే ఎదగడం అసాధ్యం !
ఓ ప్రణాళిక లేకుండా ఓటు బ్యాంక్ రాజకీయాలకే .. నేతలు పరిమితం అయితే.. ఎక్కడివక్కడే ఉంటాయి. ప్రజలకు ఉపయోగపడేవేమీ పూర్తి కావు. కానీ ఓ లక్ష్యం ప్రకారం… ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్తే .. సులువే. ఆర్థిక సంస్కరణలను పీవీ నరసింహారావు అమలు చేశారు.. కొనసాగింపుగా చంద్రబాబు పట్టాలపైకి ఎక్కించారు. విద్యుత్ సంస్కరణలతో 2004 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అయింది. తర్వాత చేతకాని వాళ్ల పాలనలో విద్యుత్ కోతలు ఉంటున్నాయి. అందుకే సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకుని ప్రణాళికా బద్దంగా పని చేయాలని చంద్రబాబు సూచిస్తున్నారు. క్రీ.శ. 1600 వరకూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో వంతు భారత్‌దే. ఇప్పుడు ప్రపంచ జీడీపీలో మన దేశ వాటా కేవలం 3.4 శాతం. ప్రపంచ వాణిజ్యంలో మన వాటా మరీ ఘోరంగా కేవలం 0.35 శాతమే. అంటే మనం కోల్పోయిన దాన్ని సాధించడానికే ఎక్కువ శ్రమపడాల్సి ఉంది.
మనకేంటి అనుకునే సమాజం – ఈ విజన్ డాక్యుమెంట్ ను పరిశీలిస్తుందా ?
ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. ఓట్లు వేసే వారు కూడా మీ భవిష్యత్ ను బాగు చేస్తాం.. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం అంటే… వినిపించుకోవడం లేదు. మీ అకౌంట్లో వేయి రూపాయలు వేస్తామంటే నమ్ముతున్నారు. ఇలాంటి సమాజం పెరిగిపోయిన సమాజంలో .. చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఎంత మేర ప్రజల్లోకి వెళ్తుందన్నది సందేహమే. కానీ చంద్రబాబు ఇది ఓట్ల కోసం చేసింది కాదు. . దేశం కోసం చేసిందే. తెలుగు రాష్ట్రాల కోసం చేసింది.