భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి బతికి ఉన్నప్పుడు వారి పిల్లలకు రాజకీయం నేర్పాలని అనుకున్నారో లేదో కానీ వారి అకాల మరణంతో పిల్లలంతా వారిలో వారు రాజకీయాలు చేసుకుంటున్నారు. భూమా దంపతులకు ముగ్గురు పిల్లలు వీరంతా టిక్కెట్ రేసులో ఉన్నారు. అలాగే భూమానాగిరెడ్డి అన్న కుమారుడు అయిన బ్రహ్మానందరెడ్డి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. ప్రస్తుతానికి వీరంతా కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాని కలసి లేరు. ఎవరిరా జకీయం వారు చేస్తున్నారు.
ఇటీవల చంద్రబాబును భూమా మౌనికారెడ్డి తన భర్త మంచు మనోజ్ తో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన నంద్యాల ఉపన్నికల్లో భూమా మౌనికారెడ్డి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటికీ విస్తృతంగా ప్రచారం చేశారు. ధాటిగా మాట్లాడగల సామర్థ్యం ఉండటంతో అందరి దృష్టిని ఆకర్షించారు. శోభానాగిరెడ్డి లేని లోటును భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ తర్వాత వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరమయ్యారు. మళ్లీ ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె అఖిలప్రియ స్థానంలో ఆళ్లగడ్డ టిక్కెట్ అడుగుతున్నట్లుగాచెబుతున్నారు.
నంద్యాలలో పోటీకి.. భూమా వారసుడు జగత్ విఖ్యాత్ రెడ్డి రెడీగా ఉన్నారు. ఆయన నంద్యాలలోపర్యటిస్తున్నారు. తన సోదరుడు బ్రహ్మానందరెడ్డి గురించి పట్టించుకోకుండానే తిరుగుతున్నారు. తనకు పోటీ చేసే ఆసక్తి ఉందని.. స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో భూమా కుటుంబం నంచి ఇద్దరు ఇంచార్జులుగా ఉండగా. టిక్కెట్ల కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ ఇంచార్జ్ గా ఉన్నారు. నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు.
భూమా వారసుల మధ్య ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆ వార్తలను వారు ఖండిస్తున్నారు. అ