నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవాడకు చేరుకోవడానికి వారం రోజుల ముందే సజ్జల రామకృష్ణారెడ్డి మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తూర్పు నియోజకవర్గానికి దేవినేని అవినాష్, సెంట్రల్ కు మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గానికి వెల్లంపల్లిని ఖరారు చేశారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇద్దరికీ టిక్కెట్లు డౌటేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో లోకేష్ పాదయాత్ర ఎంట్రీ ఇస్తూండటంతో సజ్జల ప్లాన్ మార్చేశారు. వారికే టిక్కెట్లు ఖరారు చేశారు.
అయితే టిక్కెట్లు ఖరారు చేయడానికి సజ్జల ఎవరని.. రేపు అంతా వాడేసుకుని చివరికి సర్వేల్లో అనుకూలత లేదని పక్కన పెడితే ఏం చేస్తారన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. లోకేష్ పాదయాత్ర ముందే ఈ టిక్కెట్లు సజ్జల ఎందుకు ఖరారు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుట్ర సిద్ధాంత నిపుణుడు అయిన సజ్జల.. విజయవాడలో లోకేష్ పాదయాత్రలో అలజడి రావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. ఎలా చూసినా విజయవాడ అత్యంత కీలకం. చిల్లర గ్యాంగుల్నిపెట్టుకుని ఇళ్లపై దాడులు చేయించడంలో అవినాష్ రెడ్డి రాటుదేలిపోయారు.
అందుకే లోకేష్ పాదయాత్ర విషయంలో.. ఆ ముగ్గురు నేతలు అత్యుత్సాహం చూపించి.. ఏదో చేయాలన్న సిగ్నల్ ఇవ్వడానికే సజ్జల టిక్కెట్లు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు కూడా గట్టిగానమ్ముతున్నాయి. మరో మూడు రోజుల్లో యువగళంపాదయాత్ర విజయవాడలోకి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు ఈ టిక్కెట్ల ప్రకటన ఎఫెక్ట్ ఎల ఉంటుందన్నది తేలే అవకాశం ఉంది.