సాధారణంగా సర్వేలు అనుకూలంగా వస్తే రాజకీయ పార్టీల్లో జోష్ ఉంటుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం వైసీపీలో విరక్తి వస్తుంది. ఈటీజీ అనే ఊరూపేరూ లేని సంస్థ చేసిన సర్వేను టైమ్స్ నౌ.. ప్రతి నెలా ఓ సారి ప్లే చేస్తోంది. ఎప్పుడూ అదే ఫిగర్లు వేసుకుంటూ వస్తోంది. ఏపీలో ఉన్నది పాతిక పార్లమెంట్ సీట్లు అయితే… అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తందని చెప్పుకొస్తున్నారు. ఈ సర్వేలను చూసి సగటు వైసీపీ నేత కూడా.. అంతేనంటావా అని సెటైర్లు వేసుకుటున్నారు. ఈ సర్వే వస్తుందని.. భారీ ఎత్తున సంబరాలు చేయాలని బుధవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున తాడేపల్లి ఆఫీసు నుంచి సందేశాలు వెళ్లాయి. అయితే ఒకరిద్దరు నేతలు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. ఊరూపేరూ లేని సర్వేలో ఎక్కువ సీట్లు వేయించుకుని సంబరాలు చేసుకోవడం ఏమిటని చాలా మంది ఫీలయ్యారు. నిజానికి ఏపీలో క్షేత్ర స్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయో వైసీపీ నేతలందరికీ తెలుసు. ఇలాంటి సర్వేలతో ప్రజల్ని నమ్మించాలనుకోవం కాదని.. ఇంకా కసిగా ప్రజలు ఓట్ల కోసం ఎదురు చూసేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓట్ల జాబితాలను ఏకపక్షంగా మార్చుకుని ఈ ఎన్నికల ఫలితాలు అలా వస్తాయనే ఉద్దేశంతో ఇలాంటి పెయిడ్ సర్వేలను వదులుతున్నారన్న అనుమానాలు కూడా ఆ పార్టీలో ఉన్నాయి. అసలు ఈ నాలుగేళ్ల కాలంలో వైసీపీ ఎంపీలు ఏం చేశారని ప్రజలు ఓట్లేస్తారన్న ప్రశ్న అందరి దగ్గర నుంచి వస్తుంది. అవన్నీ మాకు తెలియవు.. మాయన్న 25 సీట్లలో గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నారు.. వారు గెలిపిస్తారంతే. .. కొంత మంది ఎదురుదాడి చేస్తున్నారు. కారణం ఏదైనా ఈ సర్వేలు మాత్రం.. వైసీపీ సానుభూతిపరుల్లోనూ విరక్తి పుట్టిస్తున్నాయి.