బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాక ముందే సొంత అనుచరలతో బలప్రదర్సనలు చేసిన ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఒక్కొక్కరు షాక్ ఇస్తున్నారు. ఆయన అనుచరులంతా.. గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా భద్రాచలం నియోజకవర్గం నేత తెల్లం వెంకట్రావు అదే పని చేశారు. బీఆర్ఎస్ నుంచి పొంగులేటిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ లో చేరేముందు.. పొంగులేటి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి.. తమ అభ్యర్థులను ప్రకటించారు. అలా భద్రాచలం నుంచి తన అభ్యర్తిగా తెల్లం వెంకట్రావు ను ప్రకటించారు. ఏ పార్టీలో చేరినా అందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. తీరా చూస్తే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెల్లం వెంకట్రావుకు టిక్కెట్ దక్కడం కష్టమైపోయింది. భద్రాచలంలో కాంగ్రెస్ తరపున గెలిచిన పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని .. తెల్లం వెంకట్రావుకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని పసిగట్టిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెంటనే తెల్లం వెంకట్రావుతో చర్చలు జరిపారు. టిక్కెట్ కూడా ఆఫర్ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరిపోయారు. ఒక్క తెల్లం వెంకట్రావే కాదు కొద్ది రోజుల నుంచి పొంగులేటి క్యాంప్ కు గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నియోజకవర్గ నేతలు గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇది ఒకందుకు మంచిదేనని.. వారందరికీ కాంగ్రెస్ లో టిక్కెట్లు దక్కడం అనుమానమేనంటున్నారు. మొత్తంగా పొంగులేటికి ఉన్న అనుచరవర్గం మొల్లగా బీఆర్ఎస్లో చేరిపోతూండటం మాత్రం.. పొంగులేటికి ఇబ్బందికరంగా మరింది.