ప్రభుత్వానికి సమయం దగ్గర పడిందని అర్థమయిందేమో కానీ.. మంత్రులు సర్దుకుంటున్నారు. ఎంత వీలైతే అంత భూములు రాయించేసుకుంటున్నారు. కంపెనీలు పెడతామని ఇలా దరఖాస్తు చేసుకోగానే అలా భూములు కేటాయిస్తూ జీవోలు వెలువవడుతున్నాయి. ఇప్పటికే అలా అప్పనంగా కొట్టేసిన భూమలుకు రోడ్లు కావాలంటే వేసుకుంటున్నారు. ఇప్పటికి కొన్ని బయటకు వచ్చాయి. ఇంకెన్ని బయటకు వస్తాయో కానీ.. ఎవరూ తగ్గడం లేదు.
మంత్రి బొత్స సత్యనారాయణ… మద్యం తయారీకి అవసరం అయ్యే ఓ రసాయన ఫ్యాక్టరీ పెడతామని దరఖాస్తు చేసుకోగానే ఆయనకు.. ఎకరం పది కోట్ల వరకూ ఉన్న భూమిని పది లక్షలకు ప్రభుత్వం కేటాయించిది. అదీ కూడా ఏకంగా 30 ఎకరాల భూమి. బొబ్బిలి గ్రోత్ సెంటర్ లో ఇప్పుడు 30 ఎకరాల భూమి బొత్స కుటుంబం వశమైంది. భూములు కేటాయించిన కంపెనీల్లో బొత్స సోదరులే డైరక్టర్లుగా ఉన్నారు.
బొత్స కుటుంబ కంపెనీ పేరు సత్య బయోఫ్యూయల్స్. దీన్ని హైదరాబాద్లో 2013లో రిజిస్టర్ చేశారు. ఇంత వరకూ ఎక్కడైనా ఫ్యూయల్స్ ఉత్పత్తి చేశారా అంటే క్లారిటీలేదు. ఈ మధ్య కాలంలో ఏం వ్యాపారం చేశారో కూడా స్పష్టత లేదు. కానీ హఠాత్తుగా బయోఫ్యూయల్స్ ఫ్యాక్టరీకి ముఫ్పై ఎకరాలు కావాలని అడగడం … ఇచ్చేయడం జరిగిపోయింది. ముఫ్పై ఎకరాల ఈ ఫ్యాక్టరీలో ఉపాధి లభించేది కేవలం రెండు వందల మందికేనట. కొసమెరుపేమిటంటే.. విశాఖలో ధర్మాన అక్రమంగా పొందిన భూములు ఇటీవల ప్రజాధనంతోనే రోడ్లేసుకుంటున్న వైనం వైరల్ అవుతోంది.