డిసెంబర్లో మద్యం దుకాణాల గడువు ముుస్తుంది. సాధారణం నవంబర్లో తదుపరి దుకాణాలు ఎవరికి కేటాయించాలన్నది డిసైడ్ చేస్తారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు ఎన్నికల తాయిలాలు పంచడానికి డబ్బులు అవసరం అయ్యాయి. వెంటనే దరఖాస్తులు తీసుకుంది. ఒక్కో దరఖాస్తు ఫీజు రెండు లక్షలుగా ఖరారు చేసింది. ఇది దుకాణం వచ్చినా రాకపోయినా తిరిగి ఇవ్వరు. ఇలాంటి దరఖాస్తుల ఆదాయం రెండున్నర వేల కోట్లు వచ్చింది. దుకాణాల వేలం కూడా వేస్తారు. వేలం లో పాడుకున్న వారు కొంత మొత్తం ముందే చెల్లించాల్సి ఉంటుంది. దాని ద్వారా మరిన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది.
కేసీఆర్ ఆదాయార్జనకు ప్రత్యేక మార్గాలు అందుకున్నారు. ఓ వైపు భూముల అమ్మకం చురుగ్గా సాగుతోంది. మరో వైపు లిక్కర్ ఆదాయం జోరుగా వస్తోంది. మరో వైపు ఔటర్ లాంటి భారీ ప్రాజెక్టులను లీజుకిచ్చేసి వేల కోట్లు ఖజానాకు వచ్చేలా చేసుకుంటున్నారు. ఇక అనుమతించిన మేరకు అప్పులు.. కార్పొరేషన్ల ద్వారా ఇతర అప్పులు సేకరించి.. పథకాలను ప్రారంభిస్తున్నారు. చెప్పిన వాటికి తగినట్లుగా నిధుల మంజూరు చేస్తున్నారు.
కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలేవీ చిన్న చిన్నవి కాదు. రూ. లక్షల్లో నగదు బదిలీ చేయాల్సినవే. అందుకే నిధుల ఒత్తిడి అలాగే ఉంటుంది. ఎన్ని నిధులు వచ్చినా సరిపోవు. కానీ కేసీఆర్ మాత్రం… తాము ఇస్తూ ఉండగానే ఎన్నికలు అడ్డం వచ్చాయి.. ఎన్నికలు అయిపోగానే మళ్లీ కంటిన్యూ చేద్దాం అని నమ్మించే ప్రయత్నంలో భాగంగానే…. ఈ స్కీములు అందుకుంటున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కారణం ఏదైనా కేసీఆర్… వనరులు దాచుకుని ఎన్నికల ముందు… వాడేస్తున్నారు.