వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి… తమ రాజకీయ వారసత్వం కొత్తగా రాజకీయాల్లోకి రావాలి కానీ ఇతర కులాల వారు వద్దని అనుకుంటున్నారు. మాకు వయసైపోయింది.. కుమారురులకు చాన్సివ్వండి అని చాలా మంది మొర పెట్టుకుంటున్నా… జగన్ రెడ్డి మాత్రం తమ కులానికే ప్రాధాన్యం ఇస్తూ… వారి వారసులకే చాన్సిస్తున్నారు. విచిత్రమేమింటే…. పదవులు కూడా వారికే లభిస్తున్నాయి.
భూమన కరుణాకర్ రెడ్డి , చెవిరెడ్డి వారసులకు జగన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చెవిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులందరికీ ఆర్థిక వనరులు సక్రమంగా చేర్చే టాస్క్ అప్పగించారు . దీంతో ఆయన బయటకు కనబడకుండా పని చేసుకుపోతున్నారు., ఆయన కుమారుడికి జగన్ రెడ్డి సీటిచ్చారు. ఇక వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి సీటివ్వాలని.. తనకు టీటీడీ చైర్మన్ ఇవ్వాలని భూమన అడిగితే ఓకే చేశారు. సీమలో మరికొత మంది రెడ్డి నేతల వారసులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కొన్ని చోట్ల తండ్రీ కొడుకులకూ సీటివ్వబోతున్నట్లుగా చెబుతున్నారు. ఎమ్మిగనూరులోనూ వారసుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కానీ ఇతర కులాల్లోని నేతలు తమ వారసులకు చాన్సివ్వాలంటే… .నిర్మోహమాటంగా అవకాశం లేదని చెబుతున్నారు. పిల్లి సుభాష్ పార్టీకి రాజీనామా చేసి పోరాతనంటే. బుజ్జగించడానికి ఆలోచిస్తామన్నారు కానీ… ఆయనకు ఎన్నికలకు ముందు గట్టి ఝులక్ ఇస్తారని వైసీపీలోనే చెప్పుకుంటున్నారు. ఇక తోట త్రిమూర్తులు దగ్గర నుంచి స్పీకర్ తమ్మినేని వరకూ అందరూ వారసుల గురించి జగన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నవారే. కానీ జగన్ రెడ్డి మాత్రం… నిర్మోహమాటంంగా వారసులకు చాన్స్ లేదని చెబుతున్నారు. ఒక్క రెడ్డి సామాజికవర్గం నేతల మీద ఇంత అభిమానం చుపుతూ… ద్వితీయశ్రేణి నాయకత్వం పెరిగేలా చేసుకుంటున్నారు.. కానీ ఇతర కులాల వారి వారసులు రాకూడదా అన్న చర్చ వైసీపీలో జరుగుతోంది.
కొసమెరుపేమిటంటే.. బొత్స వారసుడికీ జగన్ రెడ్డి అంగీకరించడం లేదట. అంటే… రెడ్లు తప్ప వైసీపీలో ఎంత పెద్ద నేతలైనా ద్వితీయ శ్రేణి పౌరులేనన్నమాట.