రామోజీరావు పద్మ విభూషణుడు. దేశంలో భారతరత్న తర్వాత అంతటి గౌరవమైన పురస్కారం పొందిన మహోన్నత వ్యక్తి రామోజీరావు, ఆయన ఇప్పటికే ఎన్నో వ్యాపార సంస్థలు పెట్టారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కొన్ని లక్షల మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇది ఒక్క రోజులోనే.. రెండు రోజుల్లోనే వచ్చిన కీర్తి కాదు. అది ఆయన కఠోరంగా కష్టపడి నిర్మించుకున్నది. ఇలాంటి మేరునగధీరుడిపై ఇప్పుడు… ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడని తీవ్రమైన ఆరోపణలు, ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడినట్లుగా నాయస్థానలతో చీవాట్లు తిన్న ఓ నాయకుడు దాడి చేస్తున్నాడు. తనకు వచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని .. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ దాడి చేస్తున్నాడు. న్యాయస్థానాల ఆదేశాలను సైతం లెక్క చేయడం- లేదు.
మరి ఈ దేశంలో రెండో దేశ అత్యున్నత పురస్కారం పొందిన వారికీ రక్షణ ఇవ్వలేని వ్యవస్థలు ఉన్నట్లేనా ?. తప్పుడు ప్రచారాలతో.. తప్పుడు కేసులతో నమ్మకాన్నే పునాదిగా చేసుకున్న కంపెనీని కూలగొట్టి.. కొన్నివేల మందిని రోడ్డున పడేయాలనుకుంటున్నారు. దీనంతటికి కారణం.. ఈనాడు పత్రిక ద్వారా ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాన్ని నిలదీయడమే. ఈనాడు పత్రిక జగన్ రెడ్డి పాలనా నిర్వాకాల్ని ప్రజల ముందు పెడుతున్నందుకే విచ్చలవిడిా చెలరేగిపోతున్నారు. అది మీడియాపై దాడి కూడా అవుతుంది. ఓ ప్రజాస్వామ్య దేశంలో ఓ ప్రభుత్వం ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడి.. వ్యాపార సంస్థలపై.. దాడులు.. సొంత మీడియాలో వ్యక్తిత్వ హననాలు చేస్తున్నా… అన్ని వ్యవస్థలూ నిర్వీర్యమైపోవడం .. ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి అవమానమే.
దేశంలో ఏం జరుగుతుందో కేంద్రానికి తెలియదా.. రాష్ట్రంలో ప్రజలు అధికారం ఇచ్చిన ప్రభుత్వం దారి తప్పి మతి స్థిమితం లేనట్లుగా ప్రవర్తిస్తూంటే..పట్టించుకునేవారు ఉండారా?., ఓ వైపు ప్రతిపక్ష నేతలపై హత్యాయత్నాలు.. మరోవైపు విచ్చలవిడిగా ఓట్ల తొలగింపులు.. మరో వైపు ప్రజాస్వామ్య మూలస్తంభమైన- మీడియాపై దాడి… విచ్చలవిడిగా అవినీతి.. ఇసుక, మద్యం స్కాంలు ఇలా చెప్పుకుంటూ- పోతే..అసలు ఏపీలో రాజ్యాంగం అమలవుతోందా ? కేంద్రం ఏం చేస్తోంది ? .
పద్మవిభూషణ్పై అధికారదాడి ఖచ్చితంగా దేశ గౌరవానికి భంగకరమే. దీన్ని అడ్డుకోలేని చేతకానితనం కేంద్రానిది అయితే.. రాజ్యాంగాన్ని అమలు చేయలేననట్లుగా వ్యవస్థలను బలహీనం చేసినట్లుగా ప్రజల ముందు ఒప్పుకోవడమేమంచిదన్నది నిపుణుల అభిప్రాయం.