ఏవో కారణాలతో చాలా కాలంగా హోల్డ్ లో వుండిపోయింది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ట్రైలర్ కూడా వదిలారు. ట్రైలర్ చూస్తే ఒక కాన్సప్ట్ బేస్డ్ రొమాంటిక్ కామెడీ అనిపిస్తోంది
అనుష్క చెఫ్. ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ వుండవు. ‘తల్లి కావాలంటే ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్లి ఎందుకు ?’’ ఈ డైలాగ్ తో ఆమె క్యారెక్టర్ ని ఎస్టాబ్లెస్ చేశారు. ఇక నవీన్ స్టాండప్ కమెడియన్. తనకు కావాల్సిన మగాడి కోసం వెదుకుతున్న అనుష్క కు నవీన్ పరిచయమౌతాడు. తర్వాత ఈ ప్రయాణం ఎలాంటి మలుపులు తీసుకుందనేది తెరపై చూడాలి.
మరీ పగలబడి నవ్వేలా కాదు కానీ ఇందులో క్లాస్ ఫన్ ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. చివర్లో ఎమోషనల్ కోణాన్ని కూడా టచ్ చేశారు. అనుష్క చాలా కాలం తర్వాత మళ్ళీ తనదైన చార్మ్ తో కనిపించింది. నవీన్ టైమింగ్ ఎప్పటిలానే ఆకట్టుకుంది. చివర్లో వైరల్ అయిపోతాం అనే డైలాగ్ కొసమెరపులా మెరసింది. దర్శకుడు మహేష్ క్లాస్ డీసెంట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని మలిచాడని ట్రైలర్ భరోసా ఇచ్చింది.