చాలా రోజుల పాటు సైలెంట్ గా ఉన్న విజయసాయిరెడ్డి ఇటీవల ట్వీట్లు పెడుతున్నారు. గతంలోలా బూతులు పెట్టకపోయినా.. రాజకీయ విమర్శలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎందుకా అంటే…. అసలు విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. విశాఖలో ఓ వంద ఎకరాల కొండను ఆయన కుమార్తె నేహారెడ్డికి రాసిచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అరబిందో ఇంటి కోడలు అయిన నేహారెడ్డి… విశాఖలో ఓ ప్రైవేటు యూనివర్శిటీ పెడతానని.. భూములు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. సీక్రెట్ ఆ ఫైల్ శరవేగంగా ముందుకు సాగింది. అలాట్ మెంట్ పూర్తయిందని… వివాదం అవుతుందని ఉత్తర్వులు దాచి పెట్టారన్న ప్రచారం జరుగుతోంది.
విశాఖలో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న తర్లుకొండను నేహారెడ్డికి రాసిచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు యూనివర్శిటీ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ఒకే సారి ప్రైవేటు యూనివర్శిటీలు ఎదగవు. అంచలెంచెలుగా ఎదుగుతాయి. కానీ ఇక్కడ నేరుగా పరిశ్రమ పెట్టేసినట్లుగా యూనివర్శిటీని పెట్టేయడానికి… ప్రయత్నిస్తున్నారు. ఇదంతా భూములు చవకగా కొట్టేయడానికి ప్లాన్ అన్నమాట. ఇప్పటికే విశాఖలో.. ఉత్తారంధ్రలో వైసీపీ నేతలు చేసిన కబ్జాలు.. దందాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.,
ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులను నేరుగా రాసుకోవడం ప్రారంభించారు. ఇటీవల బొబ్బిలిలో బొత్స కుటుంబ ముప్ఫై ఎకరాలు రాయించుకుంది. ఇవి బయటకు తెలిసినవే. ఇంకా చాలా తెలియాల్సి ఉన్నాయి. అవన్నీ సీక్రెట్ జీవోల్లో ఉంటాయి. ప్రజలు అధికారం ఇచ్చింది… ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తమ పేర రాయించుకోవడానికన్నట్లుగా చెలరేగిపోతున్నారు. చివరికి ఏం చేస్తారో కానీ… ప్రజల్ని మాత్రం నిలువు దోపిడీ చేసేస్తున్నారు.