రైడ్, రాక్షసుడు లాంటి సాలీడ్ హిట్లు ఇచ్చిన దర్శకుడు రమేష్ వర్మ. ఖిలాడీ తరవాత… మరో ప్రాజెక్టుని పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. దీనికి ‘శివోహం’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి జ్ఞానవేల్ రాజా నిర్మాత. హీరో, ఇతర వివరాలు త్వరలొనే ప్రకటిస్తారు. ఈరోజు… రమేష్ వర్మ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ బయటకు వచ్చాయి. ‘భూల్ భులాయా 2’ రీమేక్ రైట్స్ జ్ఞానవేల్ రాజా దగ్గర ఉన్నాయి. ఆ కథతోనే రమేష్ వర్మ సినిమా తీస్తున్నారని సమాచారం. అయితే… ‘భూల్ భులాయా 2’లోని కోర్ పాయింట్ మాత్రమే తీసుకొని, పూర్తిగా కొత్త నేపథ్యం, కొత్త పాత్రలు సృష్టించి ఈ కథని డిజైన్ చేసినట్టు సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఇది వరకు ‘రాక్షసుడు’ తీసి హిట్ కొట్టారు రమేష్ వర్మ. ఇప్పుడు కూడా బెల్లంకొండతోనే సినిమా చేసే ఛాన్స్ వుంది. నాగ చైతన్య, వరుణ్‌తేజ్ లాంటి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.