‘భోళా శంకర్’ తో డీలా పడ్డ మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి బర్త్ డే మాంచి జోష్ నింపింది. ఈ రోజు రెండు మెగా అనౌన్స్ మెంట్లు వచ్చాయి. వశిష్ట దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఓ ఫాంటసీ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తోంది. ఈ రోజే ఆ ప్రకటన వచ్చింది.
మరో సినిమా మెగా డాటర్ సుస్మిత నిర్మిస్తోంది. ఇది మెగాస్టార్ కి 156 మూవీ. ఈ రోజే అనౌన్స్ చేశారు కానీ దర్శకుడు పేరు చెప్పలేదు. నిజానికి ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేశాడు. అనౌన్స్ మెంట్ లో అతని పేరు రావాలి. బహుసా మరో ఈవెంట్ చూసుకొని సినిమా వివరాలు అన్నీ వెల్లడించవచ్చు.
ఐతే కళ్యాణ్ కృష్ణ పేరు లేకపోవంతో ఈ సినిమాకి దర్శకుడు మారుతాడా ? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. అలాంటి సందేహాలు అవసరం లేదు. ఈ సినిమాకి కల్యానే దర్శకుడు. చిరంజీవి స్వయంగా మాటిచ్చి కళ్యాణ్ తో ఈ కథ రాయించారు. కథ పై చిరంజీవి సంతోషంగా వున్నారు. ఫ్యామిలీ పరంగా కూడా కళ్యాణ్ తో చిరుకి మంచి అనుబంధం వుంది. కళ్యాణ్ సినిమా పూర్తయిన తర్వాతే యూవీ సెట్స్ లో అడుగుపెడతారు చిరు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.