పోసాని కృష్ణమురళి లోకేష్ ను ఎన్ని రకాల బూతులు తిట్టారో లెక్కే లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదు.. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన బూతులు తిట్టారు. కానీ అప్పట్లో లోకేష్ కానీ…టీడీపీ కానీ పోలీసుల్ని ప్రయోగించాలనుకోలేదు. తమ క్యాడర్ ను ఉసిగొల్పాలనుకోలేదు. అలా అనుకుంటే… సిట్యూయేషన్ ఎలా ఉండేదో కానీ.. ఇప్పుడు లోకేష్ తనను చంపేందుకు కుట్ర పన్నుతున్నారని పోసాని భయపడుతున్నారు. తనపై నాలుగు కోట్లకు పరువు నష్టం దాఖలు చేయడంపై ఇంత కాలం సైలెంట్ గా ఉన్న ఆయన హఠాత్తుగా విజయవాడకు వచ్చి పార్టీ ఆఫీసులో కాకుండా నేరుగా ప్రభుత్వ మీడియా సెంటర్ లోనే సమావేశం పెట్టి.. లోకేష్ తనను చంపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
తనపై పరువు నష్టం కేసు వేశారని కోర్టుకు హాజరయ్యే సమయంలో చంపించడానికి ప్లాన్ చేశారని ఏడుపు మొహం పెట్టుకున్నారు. నారా లోకేష్ ఎవరిపైనా ఆరోపణలు చేయలేదా అనే వెర్రి లాజిక్ ను.. పోసాని మీడియా ముందు వ్యక్తం చేశారు. దానికి సంబంధించి జగన్ రెడ్డిపై లోకేష్, పవన్ చేసిన ఆరోపణల వీడియోల్ని ప్రదర్శించారు. అవి తప్పు అయితే.. వాటిలో నొప్పి ఉంటే జగన్ రెడ్డి పరువు నష్టం దావా వేసుకుంటారు.. పోసానికి ఎందుకు ? వాళ్లు చేసిన ఆరోపణలపై విచారణ అంటూ జరిగితే నిజాలు బయటకు వస్తాయి కాబట్టే కోర్టుకు వెళ్లలేదని టీడీపీ నేతలంటూంటారు. అవి తప్పు అయితే లోకేష్ వెళ్లినట్లుగా కోర్టుకు వెళ్లవచ్చు కదా..ఇలా ప్రెస్ మీట్లు పెట్టి నేనూ కోర్టుకు వెళ్తా అని ఏడవడం ఎందుకు అనేది ప్రాథమికంగా వచ్చే ప్రశ్న. పోసాని కృష్ణమురళి చావు భయంతో ఉన్నారు.
ఇటీవలి కాలంలో ఆయన ఎక్కడ మాట్లాడినా తాను చచ్చిపోతాననే అంటున్నారు. త న ఆస్తి మొత్తాన్ని భార్య పేరుపై రాశానని..తాను చనిపోయినా ఆమెకు నెలకు తొమ్మిది లక్షలు వస్తాయని చెప్పుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్లుగా అందర్నీ బూతులు తిట్టడం ఎందుకు ఇప్పుడు ప్రాణభయం తో వణికిపోవడం ఎందుకన్న సందేహం సహజంగా అందరికీ వస్తుంది. ఇప్పుడు సొంత ప్రభుత్వం ఉంది.. రేపు ప్రభుత్వం మారితే.. ఇంకెంత టెన్షన్ కు గురవుతారోనని ఆయన గురించి తెలిసిన వారు ఆందోళన చెందుతున్నారు.