ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి భవన్లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ విడుదల చేస్తున్న రూ. వంద నాణెం కార్యక్రమానికి టీడీపీ అధినేత హాజరవుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణెన్ని విడుదల చేయబోతున్నారు. ఇందు కోసం ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు మొత్తం మంద మందిని ఆహ్వానించారు. ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు వారి కుటుంబసభ్యులకు ఆహ్వానం అందింది. అలాగే ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న మరికొంత మందికీ ఆహ్వానాలు పంపారు.
ఈ కార్యక్రమాన్ని ఓ ప్రత్యేకమైనదిగా ఎన్టీఆర్ కుటుంబం భావిస్తోంది. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని.. అందరూ పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుబాటులో ఉంటే జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా హాజరవుతారని భావిస్తున్నారు. ఓ రకంగా ఇది ఎన్టీఆర్ కుటుంబం మొత్తం రాజకీయాలకు అతీతంగా ఓ చోట చేరే కార్యక్రమం అవుతుందని.. దీన్ని ఎవరూ మిస్ చేసుకోరన్న అబిప్రాయం వినిపిస్తోంది.
ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది కానీ.. కొన్ని ప్రతికూలతల వల్ల ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ కు గౌరవం లభించాల్సిన ప్రతి సందర్భంలోనూ.. ఇస్తూనే ఉన్నారు. రాష్ట్రపతి భవన్ లో వంద నాణెం విడుదల కార్యక్రమం హైలెట్ అయ్యే అవకాశం ఉంది.