సీఎం జగన్ దెబ్బకు ఇండిగో విమానయాన సంస్థ గింగరాలు తిరుగుతోంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కాబట్టి భయమేం లేదని.. డబ్బులొచ్చేస్తాయని రంగంలోకి దిగింది. తీరా దిగిన తర్వాత తెలిసింది … ప్రభుత్వం కాదు.. ముఖ్యం జగన్ రెడ్డి అని. అసలు విషయం ఏమిటంటే.. కడప ఎయిర్ పోర్టులు గతంలో సర్వీసులు ఆగిపోయాయి. ఎవరూ ప్రయాణించడం లేదని కంపెనీలు సర్వీసులు ఆపేశాయి. దీంతో జగన్ రెడ్డికి తలకొట్టేసినట్లయింది. తన ఏలుబడిలో సొంత ప్రాంతానికి విమానాలు లేకపోవడం ఏమిటని ఫీలైపోయి..ఇండిగోతో వయబులిటి గ్యాప్ పండింగ్ ఒప్పందం చేసుకుని సర్వీసులు ప్రారంభించారు. ఈ ఒప్పందం ప్రకారం ఏడాదికి రూ. ఇరవై కోట్లు ఇండిగోకు చెల్లించాలి.
కానీ ఇండిగో బతిమాలుతోంది కానీ.. పట్టించుకోవడం లేదు. దీంతో చివరికి సర్వీసులు నిలిపివేయాలని నిర్ణయించి బుకింగ్స్ ఆపేసింది. కానీ కడప కలెక్టర్ బతిమాలడంతో పదిహేను రోజుల అదనపు సమయం ఇచ్చింది. ఏపీలో జగన్ రెడ్డి పాలన మొదలయ్యాక.. ఎయిర్ పోర్టులన్నీ బోసి పోతున్నాయి. ఒకప్పుడు విజయవాడ ఎయిర్ పోర్టు నుండి సింగపూర్ కు నేరుగా విమానం ఉండేది. చంద్రబాబు ప్రభుత్వం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా విజయవాడను అభివృద్ధి చేసి.. విమానాలను నేరుగా పంపించడానికి.. వయబులిటి గ్యాప్ ఫండింగ్ చేసేందుకు అంగీకారం తెలిపి ఈ సర్వీసును ప్రారంభించారు. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అంటే… ఓ లెక్క ప్రకారం సీట్లు నిండకపోతే..ఆ సీట్ల డబ్బులు ప్రభుత్వం చెల్లించడం.
అయితే విజయవాడ టు సింగపూర్ సర్వీసుకు ఆదరణ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వంvరూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కానీ లోకల్ లో తిప్పాలనుకున్న విమానాలకూ ప్రయాణకులు లేకపోవడంతో ఇండిగోకు డబ్బులు కట్టాల్సి వస్తోంది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి రూ. ఇరవై కోట్లు సర్దటం కష్టంగా మారింది. బతిమాలినా ఇవ్వడం లేదు. అయితే జగన్ రెడ్డి నిర్వాకం వల్ల ఆంద్రప్రదేశ్ బ్రాండే సర్వనాశనం అవుతోందని…పాశ్రామిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.