భారతీయుల అకుంఠిత కృషి , పట్టుదల భారత్ ను ప్రపంచంలో సమున్నతంగా నిలబెడుతోంది. చంద్రుడ్ని అందుకునే లక్ష్యంతో ప్రారంభించిన చంద్రయాన్ ప్రయోగాల్లో మూడో భాగం సూపర్ సక్సెస్ అయింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి సౌత్ పోల్ పై సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇదే ప్రాంతంలో ల్యాండింగ్ కోసం రష్యా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన లూన్ ల్యాండర్ క్రాష్ కావడంతో.. విక్రమ్ పై ప్రపంచదేశాలన్నీ ఆసక్తి చూపించాయి. విక్రమ్ చంద్రుడిపై సాప్ట్ గా ల్యాండయింది.
రెండు వారాల పాటు చంద్రుడిపై ఉన్న పరిస్థితులను.. స్థితిగతులను అధ్యయనం చేయడానికి అవసరమైన ఫోటోలు.. మట్టి.. ఇతర వాతావరణ పరిస్థితల్ని అధ్యయనం చేస్తుంది. నెక్ట్స్ ప్రయోగంలో మనుషుల్ని పంపలేకపోయినా.. ఇది చంద్రుడ్ని చేరుకునే క్రమంలో గొప్ప ముందడుగు. అందులో సందేహం లేదు. విక్రమ్ ల్యాండర్ పంపే సమాచారం.. తీసుకొచ్చే వాటితో.. పరిశోధనలు జరిపి.. చంద్రుడిపై జీవనం సాగించే పరిస్థితులపై తదుపరి ప్రయోగాలు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు.. వేల కోట్లు బడ్దెట్లు కేటాయించి పరిశోధనలు చేస్తున్నా… చంద్రునిపై ల్యాండ్ కావడమే దుర్లభం అవుతోంది. యాభై ఏళ్ల కింద అమెరికా మనుషుల్ని పంపింది.
తర్వాత ఓ అబ్జేక్టును పెంపడానికి కూడా కష్టపడుతోంది. రష్యా వల్ల కావడం లేదు. చైనా కూడా గతంలోనే అన్నీ సాధించింది కానీ ఇప్పుడు సాధ్యం చేసుకోలేకపోతోంది. కానీ భారత్ మాత్రం వడివడిగా ముందుకెళ్తోంది. చంద్రయాన్ త్రీ విజయంలో ప్రపంచంలో స్పేస్ రంగంలో భారత్ బలమైనశక్తిగా అవతరించింది. ముందు ముందు .. తిరుగులేని స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జయహో భారత్ !