ఎన్నికలు వచ్చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకుఇప్పుడు ఎంత మ్యాన్ పవర్ ఉన్నా కష్టమే. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి కార్యకర్తలు అవసరం . కార్యకర్తలతో పాటు ఇప్పుడు పార్టీ కోసం ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో పని చేయడానికి ఎంతో మంది అవసరం. పరిమిత వనరులు ఉన్న జనసేన పార్టీ… స్వచ్చందంగా పని చేసే వారి కోసం అన్వేషిస్తోంది. ఇందు కోసం వాలంటీర్లను నియమించుకోవాలనుకుంటోంది. ఇందు కోసం సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చింది.
జనసేన పార్టీ కోసం స్వచ్చందంగా పని చేయాలనుకునేవారు 9281041479 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా వాట్సాప్ చేయాలని సూచిస్తూ … పోస్టు పెట్టారు. ఏం పని చేయాలన్నది జనసేన చెప్పడం లేదు కానీ.. ప్రధానంగా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమని నమ్ముతున్నారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి కొన్ని వందల మంది సోషల్ మీడియా సైన్యం ఉండేది. చాలా మందికి జీతాలిచ్చేవారు. తర్వాత భరించలేక… పెయిడ్ సోషల్ మీడియా విభాగాలను ఎత్తేశారు . ఇప్పుడు జనసేనకు స్వచ్చందంగా పనిచేసేవారే ఉన్నారు.
ఇప్పుడు ఉన్న వారు సరిపోరని.. మరింత ఎక్కువ మందిని ఎన్నికల కోసం మొబిలైజ్ చేయాలని అనుకుంటున్నారు. టీడీపీ , వైసీపీ తమకు ఉన్న నెట్ వర్క్ ద్వారా ఇప్పటికే అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధమయ్యాయి. సోషల్ మీడియా సైన్యాలను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు జనసేన కాస్త ఆలస్యంగా అయినా పార్టీ కోసం స్వచ్చందంగా పని చేసే వారి కోసం అన్వేషణ ప్రారంభించింది.