ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిన స్ట్రాటజీ ఒక్కటే. తాము చేసే తప్పులు పనులు దొరికిపోగానే.. అంతా చంద్రబాబు చేశారని చెప్పడం. ప్రతీ విషయంలోనూ అదే. చివరికి వివేకా హత్య కేసులోనూ అదే. ఇప్పుడు ఓట్ల జాబితాలను గోల్ చేసిన స్కాంలోనూ అదే స్ట్రాటజీ. తీసేసిన ప్రతి ఓటును నిశిత పరిశీలన చేయాలని ఈసీ ఆదేశించడం.. అక్రమంగా ఓట్లను తొలగించడంపై అధికారులు బలి పశువులు కావడం ఖాయమని తేలడంతో. .. గుండెలు బాదుకుంటూ మీడియా ముందుకు వచ్చేశారు. ఎప్పట్లాగే .. తాము దొరికిపోయినట్లుగా తేలిన వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి.. అలవాటైన పడికట్టు పదాలను పట్టుకుని మీడియా ముందుకు వచ్చేశారు.
ఈసీ చంద్రబాబు కనుసన్నల్లో పని చేస్తుందా. చంద్రబాబుకు టక్కుటమారా విద్యలు తెలుసు.. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారు.. వైసీపీ ఓట్లు తొలగించి ఆయనే.. దొంగ ఓట్లు తీసేస్తే తప్పా.. అంటూ… తన వాదన వినిపించారు. ఓ వైపు ఇద్దరు ఉన్నతాధికారులు ఓట్ల తొలగింపలో బలైపోయారు. వందల మంది అధికారుల జాతకం బయటపడనుంది. ఇలాంటి సమయంలో ఆయన బేలగా ఎదురుదాడి చేసి.. దొంగ ఓట్లున్నాయని.. ఈసీ దృష్టికి తీసుకెళ్లామని అంటున్నారు. తాము టార్గెట్ పెట్టుకున్న అరవై లక్షల ఓట్లు తీసేస్తే.. తాము అనుకున్న ఫలితం వస్తుందని.. అదే అసలైన ఫలితమని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లు తీసేయించి.. సులువుగా గెలిచేస్తామని జగన్ రెడ్డికి కథలు చెప్పి భ్రమల్లో ఉంచారేమో కానీ.. ఇప్పుడు అసలు వ్యవహారం వెలుగులోకి రావడంతో కుట్ర సిద్ధాంతాలతో తెరపైకి వస్తున్నాురు.
గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీ ఓట్లు తీసయించి.. దొంగ ఓట్లు కలుపుకుని ఉన్నట్లయితే…వైసీపీ ఎలా గెలిచేదో ఆయనకే తెలియాలి. మొత్తంగా అసలు ఓట్ల తొలగింపులో పెద్ద స్కాం ఉందని.. ఈసీ భావిస్తే… కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తుంది. అదే జరిగితే.. అరవై లక్లల దొంగ ఓట్ల లెక్క చెబుతున్న సజ్జల అడ్డంగా దొరికిపోయినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.