” సాధించాలన్న పట్టుదల ఉంటే.. ఆకాశమే నీ హద్దు ” అని పెద్దలు చెబుతూంటారు. ఎదగాలి..గెలవాలి అనే ఆకాంక్ష ఉన్న వారికి ఈ మాటలు గొప్ప స్ఫూర్తినిస్తాయి. ఎందుకంటే.. అలా అసాధ్యాలను సుసాధ్యం చేసిన విజయాలు చాలా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటాయి మరి. అలాంటి విజయమే చంద్రయాన్ విజయం. ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూసిన చంద్రాయన్ 3 ప్రయోగం సక్సెస్ అయింది. ప్రపంచంలోని మరే దేశం సాహసం చేయలేకపోయిన అంగారకుని సౌత్ పోల్‌పై రోవర్ ల్యాండింగ్ ను చేసి చూపించింది. భారత అంతరిక్ష రంగంలో ఇదో అద్భుత విజయం. దీన్ని ఇస్రో చేసి చూపించింది. పుణ్యభూమి పులకించింది. దేశం ఇక అభివృద్ది చెందిన దేశానికీ అంతరిక్ష రంగంలో తీసిపోదు. సౌత్ పోల్ ప్రాంతంలో ల్యాండింగ్ కోసం రష్యా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన లూన్ ల్యాండర్ అయింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు.. వేల కోట్లు బడ్దెట్లు కేటాయించి పరిశోధనలు చేస్తున్నా… చంద్రునిపై ల్యాండ్ కావడమే దుర్లభం అవుతోంది. యాభై ఏళ్ల కింద అమెరికా మనుషుల్ని పంపింది. తర్వాత ఓ అబ్జేక్టును పెంపడానికి కూడా కష్టపడుతోంది. రష్యా వల్ల కావడం లేదు. చైనా కూడా గతంలోనే అన్నీ సాధించింది కానీ ఇప్పుడు సాధ్యం చేసుకోలేకపోతోంది. కానీ భారత్ మాత్రం వడివడిగా ముందుకెళ్తోంది. చంద్రయాన్ త్రీ విజయంలో ప్రపంచంలో స్పేస్ రంగంలో భారత్ బలమైనశక్తిగా అవతరించినట్లయింది.
ఇదీ అసలు ప్రపంచదేశాలన్నీ తిరిగి చూసే విజయం !
మూన్ మిషన్ ద్వారా భారత్ సాధించిన విజయం చిన్నది కాదు. అసాధారణమైనది. ఇంకా చెప్పాలంటే రష్యా ను మించిన ఖ్యాతి భారత్‌కి దక్కనున్నది. రష్యా సాధిం చిన విజయాలన్నీ సోవియట్ యూనియన్ హయాంలో సాధించినవే. రష్యా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత రాస్‌కాస్మోస్ చేపట్టిన ఏకైక మూన్ మిషన్ లూనా-25 ప్రయోగం విఫలమైంది. ఆ ప్రయోగం విఫలమైన కొద్ది రోజుల్లోనే బారత్ అనుకున్నది సాధించింది. చంద్రుని వద్దకు ప్రయోగాలకు ఇప్పటి వరకు 13 దేశాలు 146 ప్రయత్నా లు చేశాయి. వీటిలో 69 మాత్రమే విజయవంతం అయ్యాయి. చంద్రుడిపై అన్వేషణల విషయంలో అగ్రరాజ్యానికే 15 వైఫల్యాలు ఎదురయ్యాయి. మన దేశం జరిపిన మూడు ప్రయోగాల్లో ఒక్కటే విఫలమైంది. ఇప్పుడు మూడో ప్రయోగం విజయవంతం అయింది. ముందు ముందు .. తిరుగులేని స్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రయాన్ విజయవంతం సాంకేతికంగానే కాక, ఆర్థికంగా భారత్ ఎంతో పురోగతిని సాధించినట్టు అయింది. అంతరిక్ష రంగంలో మన దేశం సరికొత్త చరి త్రను సృష్టించినట్టు అయింది. కానీ చంద్రునిపై అడుగుపెట్టే దశంలో మనం ఇంకా చాలా దశలను అధిగమించాల్సి ఉంది. కానీ ఈ దశలోకి అడుగుపెట్టినందునే భారత్ అంతరిక్ష వ్యాపార సామ్రాజన్యంలో కీలకమైన భాగం సొంతం చేసుకోతోంది.
అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని వ్యాపార విజయాలకు నాంది !
అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇప్పటికే వ్యాపారపరంగా లాభాలను ఆర్జిస్తోంది. అంతరిక్ష రంగంలో భారత్ తయారు చేసే హార్డ్ వేర్‌కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరుగుతుంది. వాటి ఆధారంగా తయారీ పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలు బాగా పెరుగుతాయి. భారత్‌ని తృతీయ ఆర్థిక శక్తిగా నిలబెట్టేందుకు మన ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. మన దేశం ఇంతవరకూ 34 దేశాలకు చెందిన 381 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. వీటి ద్వారా 279 మిలియన్ డాలర్లను ఆర్జించింది. చంద్ర యాన్ ప్రయోజనాల్లో ముఖ్యమైనది చంద్రుని ఉపరి తలంపై అన్వేషణ. ఇందుకోసం ఇస్రో ఎంతో శ్రమి స్తోంది. ఎన్నో పరిశోధనలు చేస్తోంది.చంద్రునిపై నీటి జాడలున్నాయని చంద్రయాన్-1 ప్రయోగంలో తేలింది. దాంతో జాబిలిపై మనుగడకు అవకాశాలపై ఆశలు చిగురించాయి. భూమండలానికి ప్రత్యామ్నా యంగా మరొక ఆవాసం కోసం మానవుడి అన్వేషణలో ముందగుడు పడినట్లయింది. చంద్రుడి ఉపరితలం, అక్కడి వాతావరణం స్థితిగతులను అధ్యయనం చేయడమే ఇప్పుడు జరుగుతున్న మూన్ మిషన్ల ప్రధాన లక్ష్యాలు. చంద్రుని ఉపరితలం వలసరాజ్యంగా ఉపయో గ పడుతుందా అనే దానిపై కూడా పరిశోధనలు సాగుతు న్నాయి. భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం కావడం వల్ల చంద్రునిపై ఖనిజాలు, ఇతర అమూల్య నిక్షేపాలను కనుగొంటే భారత్‌కి ఎంతో ఉపయోగకరం అవుతాయి. చంద్రయాన్-3 అక్కడి సమాచారాన్ని మనకి పంపిస్తుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలో లభించే రాళ్ళు, మట్టి కొన్ని లక్షల క్రితం నాటి పరిస్థితులను ఆవిష్కరించే అవకాశం ఉంది. చంద్రునితో భూమికి గల సంబంధాలను కనుగొనేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగపడతాయన్నది అంచనా వేయడం కష్టం. కానీ మానవుల జీవనాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది.
అంతా మేడిన్ ఇండియానే… అదే అసలైన గొప్పతనం !
ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు చేపట్టింది కేవలం రోవర్లు, ల్యాండర్లను చంద్రుడి మీదకు పంపించడానికి మాత్రమే కాదు. ఎప్పటికైనా మానవుల్ని కూడా చంద్రుడి మీదకు పంపాలనే బలీయమైన సంకల్పంతో భారత అంతరిక్ష కేంద్రం అడుగులు వేస్తోంది. కానీ, ఈ ప్రయత్నం అనుకున్నంత సులభం కాదు. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్క్విలిటీ బేస్‌పైన దిగింది. ఆరు గంటల తర్వాత నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారిగా అడుగుపెట్టిన మనిషిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ క్షణం అమెరికాకు చెందిన నాసా సహా మానవచరిత్రలో ఒక గొప్ప మలుపుగా నేటికీ చెప్పుకుంటారు. 1969 తర్వాత 1972 మధ్యలో నాసా పది మందిని చంద్రుడిపైన కాలు మోపేలా చేసింది. అయితే 1972లో యుజెన్ సెర్నన్ చంద్రుడిపైకి వెళ్లివచ్చాక అక్కడికి మనుషులను పంపే అపోలో మిషన్‌కు అమెరికా స్వస్తి పలికింది. అప్పటి నుంచి నేటి వరకు అంటే ఈ 50 ఏళ్ల కాలంలో చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు. చంద్రుడి మీదకు మనుషులు వెళ్లనే లేదని, అక్కడికి వెళ్లివచ్చారనే ఫొటోలు కూడా అమెరికా సృష్టించినవేనని అనేక కాన్సిపెరసీ థియరీలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే యాభై ఏళ్లుగా ఎందుకు చంద్రుడిపైకి అమెరికా మనుషులు పంపించలేదని ప్రశ్నకు వారు రకరకాల కారణాలు చెబుతారు. అందులో మొదటిది డబ్బులు. అమెరికాకు డబ్బు సమస్యా.. అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎంత డబ్బు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నా.. మూన్ మిషన్ లో ముందుకు వెళ్లలేకపోతున్నారు.
ఇస్రోతో కలిసేందుకు ముందుకు వచ్చిన నాసా – ఇక మనుషుల్ని పంపే మిషన్‌లోనూ ముందుకే !
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ – నాసాలు వచ్చే ఏడాది ఉమ్మడిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ – ఐఎస్ఎస్కు అంతరిక్ష యాత్రను చేపట్టనున్నాయి. అర్టెమిస్ ప్రయోగం కింద రెండు దేశాలు సంయుక్తంగా అద్భుత ప్రయోగాలు చేస్తాయి. 50 ఏళ్ల క్రితమే చంద్రుడిపై జెండా పాతినా.. ఆ తర్వాత చాలా మంది వ్యోమగాములు వెళ్లి వచ్చినా పెద్దగా పురోగతి సాధించలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందిన సమయంలో ప్రస్తుతం చంద్రుడి గురించి నిగూఢ రహస్యాలు ఛేదించేందుకు ప్రపంచ దేశాలు సిద్ధం అవుతున్నాయి. అపోలో ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు అక్కడ ఒక జెండాను పెట్టి భూమికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం చేపట్టబోయే అర్టెమిస్ ప్రయోగంలో చాలాకాలం పాటు వ్యోమగాములు అక్కడే ఉండనున్నారు. వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం అవుతున్నాయి. ఇది భూ గ్రహం కాకుండా వేరే గ్రహాల్లో మానవులు జీవించడానికి అవసరమైన పరిశోధనలకు నాసా కృషి చేస్తోంది. ఉదాహరణకు.. జాబిల్లిపై విద్యుత్ వైర్లను రోబోల సాయంతో కిలోమీటరు పొడవున వేయడానికి ఆస్ట్రోబోటిక్ అనే కంపెనీతో నాసా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో విద్యుదుత్పత్తి, పంపిణీ, హైవోల్టేజ్ పవర్ కన్వర్టర్ లాంటివి ఏర్పాటు చేయవచ్చు. అందుకే ఒక్కో విజయం సాధిస్తూ ఇస్రో ముందు కెళ్తోంది. తదుపరి ప్రయోగాల్లో మానవ సహిత అంతరిక్ష నౌక ను పంపి స్తారు. గతంలో వ్యోమ గాములను చంద్రుడిపైకి పంపిన నాసా 2025 నాటికి దక్షిణ్రధువంపై అడుగిడేలా ప్రణాళికలు సిద్ధంచేసింది. అంటే.. భారత్ తో పాటు ప్రపంచంలోని అగ్రదేశాలు కూడా ఈ మిషన్ లో పోటీ పడుతున్నాయి. ఆయా దేశాలకు ఉన్న వనరులు వేరు.. మన దేశానికి ఉన్న వనరులు వేరు. అమెరికాలో అమెజాన్, టెస్లా ఓనర్లు ప్రత్యేకంగా మూన్ మిషన్లు చేపట్టి నాసాతో కలిసి పని చేస్తున్నారు. కానీ భారత్ లో అంతగా అంతరిక్షంపై పెట్టుబడి పెట్టే వ్యాపారవేత్తలు రెడీ కాలేదు. ఇప్పుడు బయట నుంచి పెట్టుబడుల వెల్లువ వస్తుంది. అంతర్గత స్టార్టప్‌లు పెరుగుతాయి. మొత్తంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపారం జరుగుతుందని అంచనాలుఉన్నాయి.
ఈ స్ఫూర్తి ఇలా కొనసాగాలి.. విజయాలు అందాలి !
భారత్ అంతరిక్ష మార్కెట్ లో ఎవరూ ఊహించనంత గొప్ప స్థానం పొంతబోతోంది. మన ఓ రకంగా స్పేస్ విషయంలో మేడిన్ ఇండియా బ్రాండ్ నే ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. చంద్రయాన్ పూర్తిగా మెడిన్ ఇండియా. రోవర్ , ల్యాండర్ మొత్తం ఇస్రో శాస్త్రవేత్తలే రూపొందించారు. అందుకే ఈ విజయం మరింత అపురూపం. పరిశోధనలు చేసి.. మేడిన్ ఇండియా బ్రాండ్ లతోనే అంతరిక్ష ప్రయోగాలు చేస్తోంది. అనూహ్యమైన విజయాలు సాధిస్తోంది. అందుకే.. భారత్ ఇవ్వబోయే అంతరిక్ష సేవల పట్ల ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. మూన్ మిషన్ లో ఇక భారత్ పాత్రను ఎవరూ తక్కువ చేయలేరు. ఇంకా చెప్పాలంటే.. మనమే చంద్రునపై చేరుకునే మిషన్లకు నాయకత్వం వహించవచ్చు. అంటే.. ఇటు సాంకేతిక పరంగా..అటు వ్యాపార పరంగా దేశం అద్భుతమైన ప్రగతి సాధించడానికి ముందడుగుపడినట్లే. ఇస్రో విజయం.. దేశం సాధించిన విజయం. ప్రపంచంలో భారత్ ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన విజయం. ఈ విజయంతో భారత్ వాణిజ్య పరంగానే కాదు.. సాంకేతికంగానూ అగ్ర దేశాలను సైతం ఆశ్చర్య పరుసుంది.