జగన్ రెడ్డి అంటేనే చెప్పింది చేయడు.. చేసిందాని వెనుక అతి పెద్ద స్కాం ఉందని ఎవరైనా అనుమానపడతారు. ఎందుకంటే… ప్రతీది స్కామే. ఒక్కటీ నిజం బయటకు చెప్పరు. ఇప్పుడు మరోసారి అదే నిజం అవుతోంది. ఇంత కాలం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి, ప్రజల్ని పన్నుల పేరుతో పీడించి… విచ్చలవిడిగా అప్పులు చేసి పంచిన కొద్దో గొప్పో పథకాల డబ్బులు ఉచితం కాదట… అప్పులట. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అందరి దగ్గర ప్రామిసరి నోట్లు వంటి పత్రాలు తీసుకుంటున్నారు.
స్కీముల నిధులన్నీ అప్పుగా ఇచ్చారట !
పథకాల పేరుతో ఇంత మొత్తం తీసుకున్నాను.. రుణపడి ఉంటానని లబ్దిదారుల దగ్గర ప్రామిసరీ నోట్లు తీసుకోవడానికి రంగం సిద్ధమయింది. అంటే.. ఖచ్చితంగా అది ప్రామిసరి నోటు. రుణపడి ఉండటం అంటే.. మళ్లీ వసూలు చేసే ప్రణాళికలు రెడీ చేసుకునే ఉండటమే. ఏ ప్రభుత్వం ఇంత వరకూ ఇలాంటి సాహసం చేయలేదు. జగన్ రెడ్డి సర్కార్ మాత్రం… ప్రజలు తమకు అప్పు పడ్డారని లేఖలు తీసేసుకుంటోంది.
ప్రజల వ్యక్తిగత ఆస్తులు తాకట్టు పెట్టే వ్యూహమా ?
ప్రస్తుతం జగన్ రెడ్డికి రోజులు గడవడం లేదు. ఆర్బీఐ ఇచ్చిన నలభై వేల కోట్ల రూపాయల అప్పును. … కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి తెచ్చిన మరికొన్ని వేల కోట్లు కరిగిపోయాయి. ఇప్పుడు జీతాలకూ గడ్డు పరిస్థితి. కేంద్రం వారానికో వెయ్యి కోట్లు అప్పు ఇప్పిస్తోంది . అయితే చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా ఇది సరిపోదు. అందుకే ప్రజల వ్యక్తిగత ఆస్తుల్ని తాకట్టు పెట్టే వ్యూహం ఉందని అందుకే… అందరూ ప్రభుత్వానికి రుణపడి ఉన్నారన్న ఎక్నాలెడ్జ్ మెంట్లు తీసుకుంటున్నారన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
ఎవరి సొమ్మిచ్చారు ? ప్రజలు ఎవరికి రుణపడి ఉండాలి ?
ప్రభుత్వం సంక్షేమం రూపంలో చేసేది ఎప్పటికీ రుణం కాదు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి జేబులో సొమ్ము కాదు. ప్రజల సొమ్మే. ప్రజల సొమ్మును పథకాల రూపంలో పంచి….. దానికి మళ్లీ వాళ్లు రుణపడి ఉండాలనడం ఏమిటో. వైసీపీ నేతలకూ అంతు చిక్కడం లేదు. పేదల్ని బానిసలుగా చేర్చుకునే ఓ వ్యూహం ఇందులో ఉందని ఎవరికైనా అనిపిస్తే అందులో తప్పేం లేదు.
అధికారం ఇచ్చినందుకు ప్రజలకు రుణపడి ఉండాలి. కానీ జగన్ రెడ్డి తనకే ప్రజలు రుణపడి ఉండాలంటున్నారు. రుణం తీర్చుకోకపోతే ఆస్తుల్ని కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు.