మార్గదర్శిపై పగతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారాలకు గండం వచ్చి పడింది. చిట్ ఫండ్ వ్యాపారంలో పక్కాగా నిబంధనలు పాటించే సంస్థ ఏది అంటే… అందరూ మార్గదర్శినే చెబుతారు. ప్రజల డబ్బుతో ముడిపడిన వ్యవహారం కావడంతో ఆ సంస్థ ఇంకా జాగ్రత్తగా ఉంటుంది. అయితే చిట్ ఫండ్ నిబంధనలు అమలు చేయడం.. సాధారణసంస్థలకు సాధ్యం కాదు. ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. కానీ ఆ సంస్థల్లో చిట్ ఉల్లంఘనలు లెక్కలేనన్ని ఉంటాయి . వాటిల్లో మార్గదర్శి తరహాలో సోదాలు చేస్తే.. దాదాపుగా అన్ని కంపెనీలు మూతపడిపోతాయి.
మార్గదర్శితో పాటు శ్రీరామ్ చిట్స్, కపిల్ చిట్స్ వంటిపెద్ద సంస్థలతో పాటు చాలా వరకూ నాలుగైదు బ్రాంచీలతో… కొంతమందిలో పలుకుబడి తెచ్చుకుని చిట్స్ నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి. అయితే ఏవీ కూడా నిబంధనల అమలులో మార్గదర్శి స్టాండర్డ్స్ అందుకోలేదని… ఆయా సంస్థల సేవలు అందుకున్న వారు చెబుతూ ఉంటారు. వారు నిబంధనలు కూడా పాటించరని… చిట్ పాడుకున్న తర్వాత అన్ని ష్యూరిటీలు సమర్పించిన తర్వాత చెక్ ఎప్పటికి వస్తుందో చెప్పలేరన్న అభిప్రాయం ఉంది.
ఇప్పటికి టార్గెట్ మార్గదర్శినే కాబట్టి ప్రభుత్వం ఆ సంస్థను టార్గెట్ చేసుకుంది. కానీ మార్గదర్శి విషయంలో చేసిన అతి…. రూల్స్ అమలుపై చేసిన కుట్రల వల్ల ఇతర చిట్ ఫండ్ సంస్థలు కూడా వణికిపోతున్నారు. ఇప్పటిక వారిపై వివిధ శాఖల నుంచి ఒత్తిడి పెరుగుోతంది. అధికార పార్టీల నాయకులు… దందాలకు దిగుతున్నారని చందాలు ఇవ్వాలని… లేకపోతే దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారు కాకపోతే… ఆ చిట్ ఫండ్ నిరవాహకులు బెదిరిపోతున్నారు. ఇలాంటి ప్రభుత్వం తో ఎప్పటికైనా సమస్య వస్తుందని అవసరమా అనుకునే పరిస్థితికి వస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త చిట్స్ విషయంలో పునరాలోచన చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.