2014లో వచ్చిన గీతాంజలి సాలిడ్ హిట్ గా నిలిచింది. హారర్ సినిమాలు ఉధృతంగా వస్తున్న రోజుల్లో తన మార్క్ చూపించింది. కోన వెంకట్ ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ. అంజలికి మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో శ్రీనివాసరెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల తరవాత గీతాంజలికి సీక్వెల్ వస్తోంది. `మళ్లీ వచ్చింది గీతాంజలి` పేరుతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. తన సన్నిహితుడికి దర్శకత్వ బాధ్యతలుఅప్పగించినట్టు తెలుస్తోంది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. మరి.. హీరోయిన్గా అంజలినే ఉంటుందా? కొత్త అమ్మాయిని హీరోయిన్గా చూడొచ్చా? అనేది తెలియాల్సివుంది.
అయితే ఇది 2014 రోజులు కావు. హారర్ సినిమాల గిరాకీ బాగా తగ్గిపోయింది. అసలు అలాంటి జోనర్‌ని చూడ్డానికి ఎవరూ ఇష్టపడడం లేదు. హారర్‌ని కాస్త తెలివిగా చూస్తే తప్ప, అవుటాఫ్ ది బాక్స్ ఐడియా తీసుకొస్తే తప్ప మెప్పించలేరు. కోన వెంకట్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.