శ్రీవారిని నడకదారిలో దర్శించుకోవడం ఇప్పటిదా ? శతాబ్దాలుగా భక్తులు అదే విధంగా శ్రీవారిని దర్శించుకుంటారు. అప్పట్లో వన్యమృగాల బాధ లేదా అంటే… ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. మరి ఇప్పుడే ఎందుకు సమస్య వస్తోంది ?. అదే అసలైన లాజిక్. ఇప్పుడు తిరుమల నడక దారులు చూస్తే ఏ శ్రీవారి భక్తుడికైనా ఆవేదన కలుగుతుంది. భక్తులను ఇంత భయపెడుతోంది ఎవరు.. ? శ్రీవారి దర్శనానికి నడక మార్గం ద్వారా వెళ్లకుండా చేస్తోంది ఎవరు అన్నది సులువుగానే అర్థం చేసుకోవచ్చు
తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గం ఎంతో విశిష్టం. కాలి నడక మార్గానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గము శ్రీవారి మెట్లు అని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు. తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి. శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదీతర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని చదువుున్నాం .
ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి, ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి నడకన వెళ్తూ శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు. అందుకే కాలిబాట ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటూ..గోవింద నామ స్మరణలతో మారుమ్రోగేది. అలాంటి మార్గం బోసిపోవటం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. శతాబ్దాలుగా లేని వన్యమృగాల దాడులు ఇప్పుడే ఎందుకు ఎక్కువయ్యాయన్నది చాలా మందికి సీక్రెట్టే.
ఇటీవల బోన్లు పెట్టి.. అదిగో ఎలుగుబంటి.. ఇదిగో చిరుత అని భయపెట్టడం కామన్ అయిపోయింది . భక్తులు మళ్లీకాస్త పెరుగుతున్నారన్నప్పుడు… ఓ పులి వీడియో విడుదల అవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో మరి. అంతా ఆ శ్రీనివాసుడే చూసుకోవాల్సి ఉంది.