ప్రతి ఆరు నెలలకు ఓ సారి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఒపీనియన్ పోల్ ప్రకటిస్తూ ఉంటుంది. ప్రతీ సారి అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ సీట్ల ప్రొజెక్షన్స్ ఇస్తారు. గత ఏడాది ఆగస్టులో ఏడు సీట్లు… జనవరిలో పది సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రొజెక్షన్ ఇవ్వాల్సింది. కానీ ఈ షోను రన్ చేసిన రాజ్ దీప్ సర్దేశాయ్.. ఏపీ నుంచి ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్ని సీట్లు వస్తాయని చెప్పలేదు. ఎంతో కొంత క్రెడిబులిటి ఉన్న ఒపీనియర్ పోల్ కావడంతో చాలా మంది ఎదురు చూశారు. కానీ రాజ్ దీప్ సర్దేశాయ్ అందర్నీ ఆశ్చర్యపరిచారు.
అయితే చర్చా కార్యక్రమంలో ఎన్డీఏ బలం ప్రస్తావన వచ్చినప్పుడు సీ ఓటర్ చీఫ్ యశ్వంత్ దేశ్ ముఖ్.. అన్యాపదేశంగా టీడీపీ ప్రస్తావన తీసుకు వచ్చారు. పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయన్నారు. ఏపీ గురించి మాటల్లో వచ్చిన ప్రొజెక్షన్ ఇది. దీని గురించి రాజ్ దీప్ సర్దేశాయ్ ఎక్కువగా మాట్లాడలేదు. అసలు మాట్లాడలేదు. టాపిక్ డైవర్ట్ చేసేశారు. అసలు సర్వే చేసేది సీ ఓటర్ సంస్థ. ఆ సంస్థ – ఇండియాటుడే ఈ సర్వేల చేస్తాయి.
ప్రతీ సారి ప్రకటించే సర్వేలు ఈ సారి ఎందుకు ప్రకటించలేదు అంటే.. ఔట్ సైడ్ చాలా స్టోరీలు వినిపిస్తున్నాయి . జాతీయ స్థాయిలో సర్వేలను మేనేజ్ చేయడానికి వైసీపీ ఓ టీమును ఏర్పాటు చేసుకుంది. ఏదైనా సంస్థ సర్వే వేస్తోందంటే.. వారిని ప్రభావితం చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు. ఇప్పటికే పెద్ద సంస్థలకు ప్రజాధనాన్నికోట్లలో కట్టబెట్టారు. జాబితాలో ఇండియా టుడే కూడా ఉంది. దీంతో ఒపీనియన్ పోల్ రిజల్ట్ గురించి ముందే తెలుసుకుని.. మ్యానిపులేట్ చేయమని… టీడీపీకి వచ్చే సీట్లు వైసీపీకి వేయాలని కోరారు. అయితే సీఓటర్ మాత్రం దానికి అంగీకరించలేదని తెలుస్తోంది. తమ సంస్థ విశ్వసనీయతను అలాంటివి ప్రశ్నార్థకం చేస్తాయని నిరాకరించడంతో మధ్యేమార్గంలో అసలు ఏపీ ప్రొజెక్షన్స్ ఇవ్వొద్దని కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి మాత్రం అంగీకరించారు.
అయితే యశ్వంత్ దేశ్ ముఖ్ ఫ్లోలో టీడీపీ సీట్ల గురించి చెప్పడంతో.. విషయం బయటకు వచ్చింది. ఇప్పుడీ విషయం మరింత హాట్ టాపిక్ అవుతోంది. సర్వలను మేనేజ్ చేస్తే… ప్రజల అభిప్రాయాల్ని మార్చగలరా అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.