వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవకు హఠాత్తుగా తను ఎంత సమర్థుడో చెప్పుకోవాలనిపించింది. మాములుగా అయితే ఆయన గురించి ఆయన చెప్పుకోవాల్సి వచ్చేది.. కానీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్. అందుకే ఆయన గురించి ఆయన సోషల్ మీడియా సైన్యం చెబుతోంది. ఎలా సమర్థుడో వివరించేందుకు కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు. అందులో మొదటిది… ఆయన విద్యార్హత. ఆయన లా చదివాడట. అదీ కూడా ఐదేళ్లు. ఐదేళ్లు లా చదివి.. ఐదేళ్లు గోల్డ్ మెడల్స్ సంపాదించారట. ఏంటో… ప్రతీ సెమిస్టర్ కూడా గోల్డ్ మెడల్ ఇచ్చే కాలేజీలు కూడా ఉన్నాయా అని జనం ఆశ్చర్యపోతున్నారు. ప్రతీ ఏడాది గోడ్ల్ మెడల్ కొనుక్కున్నాడేమో తెలియదని కొంత మంది సైటెర్లు వేస్తున్నారు
మరి ఏకంగా ఐదు గోల్డ్ మెడల్స్ సాధించి.. .. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారా అంటే.. అదేం లేదట. అసలు లాయర్ గా కూడా ఎన్ రోల్ చేసుకోకుండా.. ఐదు గోల్డ్ మెడల్స్ తో… బర్మా వెళ్లిపోయారు. ఎప్పుడో మధుబాబు షాడో నవలల్లో తరచుగా వినిపించే పేరు బర్మా.. ఇటీవలి కాలంలో పెద్దగా వినిపించడం లేదు. బర్మా నుంచి టేకు దుంగలు వస్తాయని.. బర్మా టేకు గురించి పత్రికల్లో ప్రకటనలు వస్తూంటాయి. ఆ బిజినెస్ చేశారేమో తెలియదు కానీ పీజీ బీజినెస్ చేసి.. బర్మాలో సక్సెస్ ఫుల్గా కంపెనీని నడిపిన జెంటిల్ మ్యాన్ అంట.
అంతటితో అవలేదు బర్మాలో సంపాదించిన డబ్బులో… లేకపోతే… ఇక్కడ ఏమైనా కలెక్ట్ చేశారో కానీ.. సజ్జల బయోల్యాబ్ పెట్టి ప్రాఫిట్స్ లో నడుపుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ సజ్జల బయోల్యాబ్ లో ఏం తయారు చేస్తారో చెప్పుకోలేదు కానీ… ఏపీలో అమ్మే ఫర్ ఏపీ సేల్ ఓన్లీ బ్రాండ్ లిక్కర్ తయారు చేస్తూంటారని ఎక్కువ మంది గేస్ చేస్తున్నారు. లాస్ట్ లో అసలు ట్విస్ట్ ఏమిటంటే… నువ్ సమర్థుడివి అని జగన్ రెడ్డిగుర్తించి వచ్చి చేయాలి అంటే.. సోషల్ మీడియా ఇంచార్జ్ గా చేస్తున్నారట.
కొసమెరుపేమిటంటే.. ఇంత సమర్థుడు… సోషల్ మీడియా సైన్యంతో.. తన ట్విట్టర్ అకౌంట్ లో ని ఫాలో చేయించుకోలేకపోతున్నారు. పది వేల మంది కూడా ఆయన అకౌంట్ ఫాలో కావట్లేదు.