ఏపీ మంత్రి రోజా భర్త పరారీలో ఉన్నారు. ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. పరువు నష్టం దావా కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటూండటంతో చెన్నై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2016లో ఓ తమిళ ఛానెల్‌కి సెల్వమణి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఓ సినీ ఫైనాన్షియర్ పై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆయన కోర్టుకెళ్లారు. ప్రస్తుతం జార్జి టౌన్ కోర్టులో కేసు విచారణ నడుస్తోంది. విచారణ సమయంలో దర్శకుడు సెల్వమణి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. గైర్హాజరయ్యారు.
దాంతో కోర్టు తాజా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ముకుంద్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో అరెస్టయ్యారు. ఫైనాన్షియర్ బోద్రాపై ఇంటర్వ్యూలో సెల్వమణి పలు ఆరోపణలు చేశారు. దీంతో బోద్రా సెల్వమణితో పాటు అరుళ్‌పై పరువు నష్టం దావా వేశారు. ఈ వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం వాటిల్లిందని పిటిషన్లో ఆరోపించారు. కొద్ది రోజులకు బోద్రా మరణించగా.. ఆయన తనయుడు గగన్ కోర్టులో కేసును కొనసాగిస్తున్నారు. 2016 నుంచి కేసు కొనసాగుతున్నది. కోర్టు జారీ చేసింది నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ . సెల్వమణి ఇప్పుడు అరెస్టు వారెంట్ నుంచి తప్పించుకోవాలంటే.. కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. సినీ దర్శకుడిగా రోజా సహా ఎంతో మంది నిర్మాతల్ని నట్టేట ముంచారు. దాంతో ఆయన సినీ కెరీర్ ముగిసిపోయింది.
దర్శకుడిగా తనకు వచ్చిన పేరుతో తమిళ ఉద్యమకారుడి అవతారం ఎత్తారు. సినీ సంఘాల్లో రాజకీయం చేస్తూ.. తమిళ నటులు.. చెన్నైలోనే షూటింగ్ లు చేయాలని.. అదనీ.. ఇదనీ వివాదాలు లేవనెత్తుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లుగా అందరిపై వ్యాక్యలు చేసి.. కేసుల పాలవుతూ ఉంటారు. ఏపీలో రోజా రాజకీయ భాషను.. సెల్వమణి తమిళనాడులో. సినీ రంగంలో వాడుతూంటారు.