ఎన్టీఆర్ నాణెం ఆవిష్కరణ సందర్భంగా నడ్డాతో చంద్రబాబు మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది ఎవరికీ తెలియదు. చంద్రబాబు తర్వాతి రోజు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. తన మాటల ద్వారా బీజేపీ హైకమాండ్ కు ఓ సందేశం ఇచ్చారు. అదేమిటో అటు చంద్రబాబుకు..ఇటు బీజేపీ హైకమాండ్ కే తెలుసు. అయితే ఇదంతా ఏదో తేడాగా ఉందని అనుకున్నారేమో కానీ.. వైసీపీ నేతలు కంగారు పడిపోతున్నారు. పురందేశ్వరి సాయంతో ఢిల్లీలో చంద్రబాబు జిమ్మిక్కులు చేస్తున్నరని బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని .. సోషల్ మీడియాలో.. మీడియాలో ప్రచారం చేయడమే కాదు.. అమిత్ షాపై రాళ్లదాడి.. మోదీపై విమర్శలు అంటూ.. బీజేపీకి తాము కూడా ఏదో సందేశం పంపాలనుకుంటున్నారు.
చివరికి సజ్జల రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు వంగి వంగి నడ్డాతో మాట్లాడారని.. తిట్టిన నోటితోనే మళ్లీ బీజేపీని పొగుడుతున్నారని విమర్శఇంచారు. రాజకీయాలు ప్రజల కోసం ఉండాలని పెద్ద పెద్ద మాటలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారని కూడా మాట్లాడారు. కుర్చీలో ఇద్దరూ పక్కకు వంగి దగ్గరగా మాట్లాడటం కూడా.. తప్పుగా అనిపిస్తోంది వైసీపీ నేతలకు. సీఎం హోదాలో ఉండి మోడీ కాళ్లు పట్టుబోయిన జగన్ రెడ్డి దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్నాయన్న సంగతిని మర్చిపోయారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకునే విషయంలో ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. తెలంగాణలో సమయం గడిచిపోయిందని తేల్చేశారు. ఏపీలో మాత్రం ఆలోచిస్తామన్నారు.
అయితే ఆ పొత్తులు … బీజేపీతో ఉంటాయని చెప్పలేదు. చంద్రబాబు దృష్టిలో జనసేనతో మాత్రమే పొత్తులు ఉంటాయి. అయితే బీజేపతో చంద్రబాబు సంబంధాలు మెరుగుపడటంతో.. వైసీపీలో మాత్రం కంగారు పెరిగిపోతోంది. ఓ వైపు తాము అన్ని విధాలుగా మద్దతిస్తున్నా… బీజేపీ నేతలు విమర్శలు చేస్తూండటం.. జాతీయ స్థాయిలో వైసీపీ పనైపోయిందన్న ప్రచారం జరుగుతూండటంతో.. వైసీపీ నేతలకు కంగారు ప్రారంభమయింది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ప్రారంభించారు.