హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ని వైసీపీ దూరం పెడుతోంది. ఆయనను కీలక సమావేశాలకూ పిలవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి తదితరులు ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు తప్పా తక్కినప్పుడు ఎక్కడా ఆయన కనిపించడం లేదు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షల్లోనూ ఆయనకు పిలుపు రావడం లేదు. శం దాదాపుగా లేదనే ప్రచారమే సాగుతోంది. హిందూపురం ఎంపీ స్థానికి జగన్ రెడ్డి సన్నిహితులు ఇప్పటికే ఖర్చీఫ్ వేశారు.
ఇటీవలి కాలంలో టిక్కెట్ హామీ కోసం సీఎం జగన్ ను చాలా సార్లు కలిసినా… మళ్లీ నీకే టిక్కెట్ అనే భరోసా దక్కలేదు. అదే సమయంలో.. ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా చాన్సిస్తారేమోనని ఎదురు చూస్తున్నా.. ఇంత వరకూ అలాంటి సంకేతాలు రాకపోవడంతో.. మాధవ్ కూడా సైలెంట్ గానే ఉంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సీటు విషయంలో ఆలోచించాలని ఆయన జగన్ ను కోరుతున్నారు. కానీ పరిశీలనకు కూడా చాన్స్ లేదన్న సంకేతాలు అందాయి.
పోలీసు అధికారిగానున్న సమయంలోనూ ఆయన చుట్టూ అనేక వివాదాలున్నాయి. ఎంపీ అయిన తరువాత మహిళతో నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. అప్పటి నుంచి ఆయన రాజకీయంగానూ అంత క్రీయాశీలకంగా కనిపించడం లేదు. ఎంపీగా ఆయన పని తీరు నాసిరకంగా ఉంది. కియా ఓనర్లను బెదిరించడం దగ్గర్నుంచి అన్నీ చేయాల్సినవి చేశారు. చివరికి అందరికీ శత్రువు అయ్యారు.. ఆయనను వైసీపీ దూరం పెడుతోంది.