వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ పై డాక్టర్ సునీత హైకోర్టు నిర్ణయం పైన సుప్రీం ఆశ్రయించారు. తన అభ్యంతరాలను వాదనలను కోర్టు ముందు ఉంచారు. వీటిని విన్న న్యాయస్థానం సెప్టెంబర్ 11న ఈ కేసు విచారించాలని నిర్ణయించారు. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేసిన సీబీఐ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరింది.
జూలైలో జరిగిన విచారణ సందర్భంగా సునీత దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి కూడా సీబీఐ సిద్ధపడలేదు. సమయం కావాలని సుప్రీంకోర్టును కోరింది. అందుకే సుప్రీంకోర్టు విచారణను సెప్టెంబర్ కు వాయిదా వేసింది. మరో వైపు సీబీఐ కనీసం దర్యాప్తు గడువు పొడిగించాలని కూడా కోరలేదు. అప్పట్నుంచి వివేకా కేసులో ఎలాంటి పరిణామాలు లేవు. గతంలో సుప్రీంకోర్టు జూన్ 30 వ తేదీలోపు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఆ గడువు పూర్తయినా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అయినా దర్యప్తు కొనసాగించాలని సమయం కోరేందుకు నిరాసక్తంగా ఉంది.
గంగిరెడ్డి బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. వివేకా హత్య కేసు చాలా సీరియస్ అంశమని వ్యాఖ్యానించారు. కేసు వివరాలన్నింటినీ సీల్డ్ కవర్ లో తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి బెయిల్ పిటిషన్ పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని.. లాయర్లు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. గంగిరెడ్డి తరపు లాయర్లుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్ తోపాటు పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఇప్పుడు సీబీఐ.. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరడంతో.. పదకొండో తేదీన విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.