ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావాలని ఎంతగానో ఆశపడి.. దానికి తగ్గట్లుగా తమ పనితీరు చూపిన వారిలో టీచర్లు ముందు ఉంటారు. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే దీనికి సాక్ష్యం.. అయితే ఓట్లేసిన వాళ్లను రోడ్డున పడేయడంలో ఎవరిపైనా వివక్ష చూపని జగన్ రెడ్డి సర్కార్… టీచర్లనూ మొదటి వరుసలోనే ఆ పని చేసింది. టీచర్లను ఎందుకు వర్గ శత్రువులుగా ప్రకటించుకున్నారో కానీ వారిని రాచి రంపాలన పెట్టడం ప్రారంభించారు.
మొదట కరోనాలో వారిని మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. తర్వాత బాత్ రూములు ఫోటోలు అప్ లోడ్ చేయమని ఆదేశించారు. చివరికి హాజరు విషయంలోనూ… సొంత ఫోన్ వాడుకుని ఆన్ లైన్ హాజరు నమోదు చేయాలన్నారు. ఒక్క టీచర్ కు ెన్ని యాప్ లు ఫిల్ చేయాలో.. ఆ బాధలేంటో వారికే తెలుసు. ఇంతా చేసి వారికి సమయానికి జీతాలిస్తున్నారా అంటే అదీ లేదు. అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగులు ఉంటే.. టీచర్ల ఖాతాల్లో వేస్తున్నారు. గత నాలుగేళ్ల కాలంలో .. సమయానికి జీతాలు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.
పీఆర్సీ పేరుతో జీతాలు పెంచకపోను తగ్గించారు. టీచర్ల కోపం ఎలా ఉంటుందో విజయవాడలో నిర్వహించిన పీఆర్సీ ర్యాలీలో నిరూపించారు. అయితే ఉద్యోగ సంఘం నేతలు అ బలాన్ని తమ బలంగా చెప్పుకుని అమ్మేసుకున్నారు. అక్కడా వీరు మోసపోయారు. హక్కుల కోసం పోరాడిన ఎంత మంది కేసుల పాలయ్యారో చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ అడ్డగోలు నిర్ణయాలకు తోడు.. ప్రవీణ్ ప్రకాష్ అనే విపరీత ప్రవర్తన అధికారిని వారిపైకి రుద్దారు.
ఈ ప్రవీణ్ ప్రకాష్ ఎంత మూర్ఖత్వంతో ఉంటారంటే.. ఓ సారి విజయనగరం పర్యటనకు వెళ్లినప్పుడు సరిగ్గా స్పందించలేదని.. ఆ జిల్లా ఉన్నత టీచర్లు అధికారులను సస్పెండ్ చేశారు. కానీ తర్వాత టెన్త్ ఫలితాల్లో ఆ జిల్లాకే ప్రథమస్థానం రావడంతో వారి సస్పెన్షన్ ఎత్తివేయాల్సి వచ్చింది. అంటే ఎంత మూర్ఖంగా ..తన ఈగో శాటిస్ ఫై చేసుకోవడానికి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దల పైశాచికత్వం… మొత్తం… అన్ని రకాలకుగా ఇప్పుడు టీచర్లపై అమలు చేస్తున్నారు. అందుకే ఉపాధ్యాయ దినోత్సవమైనా…వారికి నో హ్యాపీ