ఇండియాను భారత్‌గా మార్చేస్తున్నారహో !

విపక్ష కూటమి నేతలు తమ కూటమికి ఏ ప్లాన్ తో ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నారో కానీ ఆ పేరుకు మూడిపోయింది. అసలు మన దేశం పేరు ఇండియానే కాదని.. భారత్ అని కేంద్రం చెబుతోంది. ప్రపంచ దేశాలకు ఇప్పటికే జీ 20 సమావేశం సందర్భంగా పంపిన ఆహ్వానలేఖల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారు. అదే సమయంలో.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా బయటకు పొక్కింది. దీనిపై బీజేపీ నేతలు కూడా నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. తాము భారతీయులమని.. తమది భారతదేశమని అంటున్నారు. ఇండియా అనే మాట రానివ్వడం లేదు.

ప్రపంచంలో ఇండియా అనే పేరుతోనే మన దేశం తరపున లావాదేవీలు జరుగుతాయి. మన దేశంలో మాత్రం భారత్ అని ప్రస్తావిస్తూ వస్తాం. అంతర్జాతీయ వేదికపై ఇండియాగానే అభివర్ణిస్తారు. ఐక్యరాజ్యసమితిలోనూ ఇండియా అనే ఉంటుంది. ఇప్పుడు ఆ పేరును భారత్ అని మార్చేందుకు కేంద్రం సిద్ధమైనట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. దీనికి కారణం ఇండియా కూటమి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికలు ఇండియా వర్సెస్ బీజేపీ అన్నట్లుగా జరుగుతాయని.. లఇది ఓటర్లపై ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో భారత్ పేరును మార్చేయాలని డిసైడయ్యారని అనుకోవచ్చు.

పేరు మార్పు అనేది బీజేపీ ఓ ఉద్యమంలా చేపడుతోంది. యూపీలో సహా అనేక రాష్ట్రాల్లో ముస్లింపేర్లు ఉన్న సిటీల పేర్ల మార్చేసింది. ఆగ్రా పేరు ఇప్పుడు ఆగ్రా కాదు.. అలహాబాద్ పేరు ఇప్పుడు అలహాబాద్ కాదు.. కొత్త కొత్త పేర్లు చాలా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఇండియా పేరు అంటే.. దేశం పేరునే మార్చేస్తూండటం మాత్రం… అందరికీ కాస్త వింతగానే అనిపిస్తుంది. పాలకులు ఏం చేయాలనుకుంటే అది చేయగలరు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close