నిన్నటిదాకా జమిలీ జ్వరం.. ఇప్పుడు కొత్తగా భారత్ పేరుపై వివాదం. దేశంలో మరో టాపిక్ చర్చకు రావట్లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇదే కావాలి. నిన్నటిదాకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వాళ్లు.. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని అధికారిక పత్రాల్లో మార్చేశారు. దీంతో అందరూ ఇండియా పేరును మార్చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఇండియా అయినా.. భారత్ అయినా రెండు ఒకటేనని ప్రపంచం మొత్తం తెలుసు. రెండు వాడుకలోనే ఉన్నాయి.
ఇప్పుడు కొత్తగా భారత్కు భారత్ అని పేరు పెట్టాల్సిన అవసరం లేదు. భారత్ అని కొత్తగా మన దేశానికి పేరు పెడుతున్నారంటూ హడావుడి జరుగుతోంది. కానీ భారత రాజ్యాంగంలోనే భారత్ అనే పేరు ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 కూడా India , that is Bharath , a Union of States అని ఉంది. ఇప్పుడు ఏమైనా చేయాలి అంటే… ఇంకెవరూ ఇండియా అనే పదాన్ని వాడకుండా ఉండాలని అనుకుంటే… ఆ పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించారు. మన దేశం పేరు భారత్ ఒక్కటే అని చట్టం చేసుకోవాలి.
అయితే ఇప్పటికిప్పుడు ఇండియా పేరును తొలగించడం అంత ఈజీనా అంటే… కానే కాదు. దాని వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో చెప్పాల్సి న పని లేదు. భారత్ లో ప్రతీ కరెన్సీ నోటుపైనా ఇండియా అనే ఉంటుంది. ప్రతీ అధికారిక పత్రం లో ఇండియా పేరు మీద నడుస్తూ ఉంటుంది. తరతరాలుగా ఉన్న శాసనానల్లో ఇండియా అని ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఇండియాను డిలీట్ చేయడం ఒక్క బటన్ తో సాధ్యం కాదు. కానీ పాలకులు ఏదనుకుంటే… అది చేస్తారు.. దేశానికి జరిగే నష్టం గురించి వారికెందుకు. అలాంటి నష్టాలు ఏమైనా.. కష్టాలు ఏమైనా పడాల్సింది ప్రజలుకదా !